*బేగంపేట నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన మహిపాల్ రెడ్డి
తెలంగాణ కెరటం:రాయపోల్ ప్రతినిధి : డిసెంబర్ 12
బేగంపేట నూతన ఎస్ఐ గా గురువారం డి మహిపాల్ రెడ్డి పదవీ బాధ్యతలు తీసుకున్నారు గురువారం మర్యాదపూర్వకంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ మేడమ్ ను కలసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ మేడం మహిపాల్ రెడ్డి ని అభినందించి శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని తెలిపారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని సూచించారు. హెల్మెట్ వినియోగము త్రిబుల్ రైడింగ్ తదితర అంశాల గురించి వాహనదారులకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.