రాయపోల్ మండలంలో సీఎం కప్ క్రీడోత్సవాలు
మానసికంగా ఉత్సాహంగా ఉండాలంటే క్రీడలలో భాగస్వామ్యం కావాలి
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుంది
మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్
ఎంపీడీవో బాలయ్య
మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి
తెలంగాణ కెరటం:రాయపోల్ ప్రతినిధి:డిసెంబర్ 12
రాయపోల్ మండల కేంద్రంలోని సీఎం కప్పు క్రీడోత్సవాలను గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో క్రీడోత్సవాలను రాయపోల్ మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్, ఎంపీడీవో పోతరాజు బాలయ్య ,ఎంఈఓ సత్యనారాయణరెడ్డి క్రీడోత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతోపాటు మానసికంగా ఉత్సాహంగా ఉండాలంటే విద్యార్థులు క్రీడలలో భాగస్వామ్యం కావాలని వారు అన్నారు.సిఎం కప్ పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులు కబడ్డీ వాలీబాల్ కోకో క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. గెలుపును నిలుపుకోవాలి ఓడిపోయినా వారు గెలవడానికి ప్రయత్నం చేయాలన్నారు. కబడ్డీ, వాలీబాల్ లో గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. మనం శ్రమపడాలి చదువుతో పాటు మానసిక దృఢత్వాన్ని సాధించాలంటే మీకు ఇష్టమైన క్రీడల్లో పాల్గొనాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు గ్రామపంచాయతీ కార్యదర్శి శివకుమార్ పరమేష్ నాగరాజు మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పిఈటి లు అనీఫ్ ,పావని ,రవి ,లతీఫ్ క్రీడాకారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.