---Advertisement---

జర్నలిస్టులపై దాడి హేమమైన చర్య…

---Advertisement---

జర్నలిస్టులపై దాడి హేమమైన చర్య…

 

జాతీయ రహదారిపై జర్నలిస్టుల నిరసన కార్యక్రమం

 

 

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 12 : విధి నిర్వహణలో కవరేజ్ కు వెళ్ళిన జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం హేమమైన చర్య అని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు అన్నం అనిల్, దారిశెట్టి రాజేష్, రుద్ర శ్రీనివాన్, ఇందూరి సత్యంలు అన్నారు. కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రెస్ క్లబ్ లకు అతీతంగా జర్నలిస్టు సంఘాల నేతలు, వివిధ పార్టీల నాయకులు గురువారం జాతీయ రహదారిపై ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం రాత్రి సినీ నటుడు. మోహన్ బాబు టీవీ 09, టీవీ 05, ఈటీవీ 02 ప్రతినిధులపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ మోహన్ బాబు విలనిజం జర్నలిస్టులపై నడవదని అన్నారు. గతంలో సిని నటి సాక్షి శివానంద్, నటి జయంతిలపై మోహన్ బాబు చేసిన దాడులను, పెట్టిన హింసలను ఇప్పటికీ అనేక మందికి గుర్తున్నాయన్నారు. ఒక నటుడుగా, నిర్మాతగా, పార్ట్ టైం రాజకీయవేత్తగా, విద్యాసంస్థల నిర్వాహకుడిగా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఎన్ని పాత్రలు పోషించినా తన క్రిమినల్ బుద్ధిని మోహన్ బాబు ఏనాడు వదిలి పెట్టలేదని విమర్శించారు. గాయపడిన జర్నలిస్టులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని, జర్నలిస్టులపై హత్యాయత్నానికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఆకుల మల్లికార్జున్, జర్నలిస్టులు షికారి రామకృష్ణ, అంజు గౌడ్, గంగాధర్, రాజు, బి.నవీన్, నవీన్, సత్యం రావు, సలీం ఫారుఖీ, సాజీద్ అలీ, గంగాధరి రాజేందర్, ముబీన్, శ్రీకాంత్, విజయ్, ఎన్.శ్రీనివాస్, శికారి గోపి, లక్ష్మీ రాజం, చంద్ర ప్రకాష్, ఉరుమడ్ల శ్రీనివాస్, కత్తిరాజ్ శంకర్, ముఖేష్, పుల్ల శ్రీనివాస్, వెంకటేష్, కోటేష్, మిట్టపెల్లి రమణ, సతీష్, సుమన్, విజయ్, ఎస్.శ్రీనివాస్, రాజం, బి.సంతోష్, హైమద్, మర్రి సంతోష్, నారాయణ, బలిజ రాజి రెడ్డి, నరసింహమూర్తి, ప్రేమ్, సాయి, మహమ్మద్ అలీ, గజం శంకర్, ముసావీర్, జి.శ్రీనివాస్, చిరంజీవి, ఆర్.విజయ్, నజీబ్, ఆనాస్, వినోద్, వివిధ పార్టీలకు చెందిన నేతలు అన్నం అనిల్, దారిశెట్టి రాజేష్, రుద్ర శ్రీనివాస్, బింగి వెంకటేష్, ఇందూరి సత్యం, తులసి కృష్ణా, నయిం, భుమా గౌడ్, కస్తూరి లక్ష్మీనారాయణ, సుధవేణీ మహేష్, అంజయ్య, ప్రభు, సజ్జు వివిధ సంఘాల నాయకులు అంబటి శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment