కొత్త డైట్ మెనూ ప్రారంభానికి ఏర్పాట్లు పరిశీలన
తెలంగాణ కెరటం:రాయపోల్/ దౌల్తాబాద్, ప్రతినిధి: డిసెంబర్13
ప్రభుత్వం డైట్,కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో మండల పరిధిలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర బీసీ సంక్షేమ పాఠశాలలో కొత్త డైట్ మెనూ అమలు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ప్రిన్సిపాల్ తో కలిసి పరిశీలించారు కాంగ్రెస్ నాయకులు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పడాల రాములు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్టల్లో విద్యార్థులందరికీ ఒకే రకమైన ఆహార మెనూను అమలు చేయడం హర్షణీయమన్నారు. కొత్త డైట్ విధానాన్ని దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి లింగరాజుపల్లి లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.ప్రభుత్వం గతంలో ఉన్న డైట్ చార్జీలు 40 శాతం,కాస్మెటిక్ చార్జీలను 200 శాతం మేర పెంచిందన్నారు.ఆయనతోపాటు సీనియర్ నాయకులు కర్నాల శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బండారులాలు, టిపిసిసి సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్ పంచమి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పంచమి వినోద్,యూత్ కాంగ్రెస్ మండల కార్యదర్శి పంచమి రామస్వామి ఉన్నారు.