---Advertisement---

వేములవాడ పట్టణంలో అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వ విప్*

---Advertisement---

*వేములవాడ పట్టణంలో అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వ విప్*

*ప్రభుత్వ విప్ కృతజ్ఞతలు తెలియజేసిన విగ్రహ డెవలప్ మెంట్ జేఏసీ*

తెలంగాణ కెరటం.వేములవాడ డిసెంబర్ 13

వేములవాడ అంబేద్కర్ విగ్రహ డెవలప్ మెంట్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసి పట్టణంలో గత 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇటీవల కాలంలో చేస్తున్న అంబేద్కర్ చౌరస్తా సుందరీకరణలో భాగంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అంబేద్కర్ విగ్రహ డెవలప్ మెంట్ జేఏసీ విజ్ఞప్తి మేరకు అంబేద్కర్ చౌరస్తాలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపిన విగ్రహ డెవలప్ మెంట్ జేఏసీ సభ్యులు. ఈ కార్యక్రమంలో జింక శ్రీధర్, గుండా థామస్, సంటి అంజిబాబు, గుడిసె మనోజ్ కుమార్, మూలే కిషోర్, పిట్టల సతీష్, గుర్రం అశోక్, బత్తుల కమలాకర్, సిరిగిరి శ్రీకాంత్ చర్ల బాలు, జింక శ్రీనివాస్, చర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment