ఆర్పీలను పరామర్శించిన కౌన్సిలర్ మాడవేణి నరేష్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 13 : కోరుట్ల పట్టణంలోని అర్పిలను పోలీసులు శుక్రవారం ముందస్తుగా అరెస్టు చేసి స్ధానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. బిజెపి ఫ్లోర్ లీడర్, 22 వార్డు కౌన్సిలర్ మాడవేణి నరేష్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆర్పీలను పరామర్శించారు. ప్రభుత్వం తమకు పది నెలలుగా వేతనాలు చెల్లించాలని ఆర్పిలు మాడవేణి నరేష్ తో ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విధాల అండగా ఉంటామని మాడవేణి నరేష్ వారికి భరోసా ఇచ్చారు.