*గద్దర్ పుస్తకావిష్కరణ మహాసభను విజయవంతం చేయండి
-అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అస శ్రీరాములు.
తెలంగాణ కెరటం :రాయపోల్ ప్రతినిధి :డిసెంబర్ 14
గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యంలో రచించిన పుస్తకాల ఆవిష్కరణ సభను విజయవంతం చేయాలని అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆశ శ్రీరాములు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధిపేట విపంచి కళానిలయంలో డిసెంబర్ 15 ఆదివారం ఉదయం 10:30 గంటలకు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీపుల్స్ కాన్ఫరెన్స్ లో పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు.గద్దర్ రచించిన తరగని గని గద్దర్, పాటకు జీవకణం గద్దర్, లస్కర్, అండర్ గ్రౌండ్ నాలుగు పుస్తకాలను ప్రజల సమక్షంలో గద్దర్ సాహిత్యాన్ని విడుదల చేయనున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గద్దర్ అభిమానులు, దళిత బహుజన, ప్రజా సంఘాల నాయకులు, కవులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. విశ్వరత్న డా. బి.ఆర్ అంబేద్కర్ తన మేధోశక్తితో రచన ద్వారా అన్ని వర్గాల ప్రజలను చైతన్య పరిచారు. అదే తరహాలో ప్రజలందరినీ తన ఆట మాట పాటలతో చైతన్యపరిచిన ఘనత గద్దర్ కే దక్కుతుందని స్పష్టం చేశారు. సిద్ధిపేటలో జరిగే పుస్తకావిష్కరణ సభలో పాల్గొని విజయవంతం చేస్తే ప్రతి ఒక్కరు గద్దర్ కు నివాళి అర్పించినట్లేనని విజ్ఞప్తి చేశారు.