---Advertisement---

సర్వేలో తప్పిదాలకు తావివ్వొద్దు.

---Advertisement---

సర్వేలో తప్పిదాలకు తావివ్వొద్దు.

 

-అర్హులకు లబ్ధి చేకూర్చాలి.

 

-శిథిలావస్థలోని ఇళ్లలో ఉంటున్న వారి వివరాలనూ సేకరించాలి.

 

-సర్వే చేపట్టే వార్డులకు సంబంధించిన దరఖాస్తుదారులకు ముందుగానే సమాచారాన్ని అందించాలి.

 

-అధికారులకు కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశం.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 13:

 

ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పిదా లకు తావివ్వొద్దని,అర్హులకు లబ్ది చేకూరేలా యా ప్లో వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.చిన్న శంకరం పేట మండల పరిధిలో మాందాపూర్ గ్రామంలో కొన్నసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే.యాప్ వివరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 469 గ్రామపంచాయతీలలో నాలుగు మున్సిపాలిటీలలోగల 75 వార్డులలోఇందిరమ్మ ఇండ్ల సర్వే అత్యంత పారదర్శకంగా కొనసాగుతుందని మొదటి విడతగా నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మంజూరు చేయడం జరుగుతుందని, విడతల వారీగా ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పారు.శిథిలావస్థకు చేరిన, పురాతన ఇళ్లలో నివాసముంటున్న వారు కొత్త ఇళ్లను నిర్మిం చుకునేందుకు వస్తే వారి వివరాలను సైతం యాప్లో పొందుపర్చాలని సూచించారు. ఒక్కో దరఖాస్తుదారుని వివరాలను నమోదు చేసేందుకు ఎంత సమయం పడుతోంది. రోజుకు సగటున ఎన్ని కుటుంబాల వివరాలను నమోదు చేస్తు న్నారు, సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురువుతున్నాయని కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు.ఇప్పటి వరకు ఎంతమంది వివరాలు సేకరించారు.ఆన్లైన్లో ఎన్ని అప్లోడ్ చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియలో భాగంగా సర్వే వేగవంతంఅయ్యేందుకుసంబంధిత పత్రాలను దరఖాస్తుదారులు అందుబాటులో ఉంచుకోవాలని కోరారు.కలెక్టర్ వెంట మండల అభివృద్ధి అధికారి దామోదర్ పంచాయతి సెక్రటరీ,కుమార్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment