గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు.

గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు.

 

పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు అన్నీ ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ.

 

దుకాణాలు, చిల్లర దుఖానాలు మూసివేయాలి.

 

జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 13:

 

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ

ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిధిలో డిసెంబర్ 15 నుండి 16 వరకు జరిగే TGPSC గ్రూప్-II పరీక్షల నేపథ్యంలో అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

డిసెంబర్ 15 నుండి 16 వరకు 16 పరీక్షా కేంద్రాలలో నిర్వహించే గ్రూప్- II పరీక్షల సందర్భంగా డిసెంబర్ 15 ఉదయం 6:00 గంటల నుంచి డిసెంబర్ 16 సాయంత్రం 07:00 వరకు అంక్షలు అమలులో ఉంటాయని, పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని, ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు,మైకులు,డిజేలతో ఉరేగింపులు, దర్నలు, ప్రచారాలు నిర్వహించరాదని పెర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు. ట్రాఫిక్ ఆంతరాయం కలగకుండా జిల్లా పోలీస్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీలు,మాల్ ప్రాక్టీస్ వంటి వాటికి ఆస్కారం లేకుండా , పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవడం జరిగింది అని ఎస్పీ తెలిపినారు. మొత్తం జిల్లాలో 200 మంది పోలీస్ అధికారులతో భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని ఇట్టి బందోబస్త్ లో పాల్గొంటారు అని ఎస్పీ తెలిపినారు.ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు,రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు.అదేవిధంగా పరిక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు నిఘాను నియమించి సమాచారం సేకరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.అలాగే పరీక్షా కేంద్రాలకు దగ్గరలో ఉండే జిరాక్స్ షాపులు, ఇతరత్రా వాటిని ముందుగానే మూసి ఉంచేలా దుకాణదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలలోకి అభ్యర్థులు, కేటాయించబడిన అధికారులు, సిబ్బంది తప్ప ఇతరులనుఅనుమతించకూడదని తెలియజేసారు.పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో ఉండాలని పరీక్ష డిసెంబర్ 15 నుండి 16 రెండు రోజులు జరుగుతుందని మొదటి సెషన్ ఉదయం 10:00 నుండి 12:30 వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 03:00 నుండి 05:30 వరకు జరుగుతుందని అన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఉ 08:30 నుండి 09:30 గంటలకు వరకు అనుమతిస్తామని మధ్యాహ్నం సెషన్ లో 01:30 నుండి 02:30 వరకు మాత్రమే అనుమతిస్తామని తెలియచేశారు. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గుర్తింపు కొరకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకోవడం జరుగుతుందని, ఇందుకు వీలుగా అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, పరీక్షకు సంబంధించిన నిబంధనలు పూర్తిగా హాల్ టికెట్లో పొందపరచి ఉంటాయని, అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు హాల్ టికెట్ లోని నిబంధనలు చదువుకోవడం మర్చిపోవద్దని, అభ్యర్థులను చెప్పులతో మాత్రమే పరీక్ష హాలుకు రావాలని, షూస్ కు అనుమతి లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా మొబైల్ ఫోన్, క్యాలిక్యులేటర్, వాచ్, బెల్ట్ తదితర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ కు అనుమతి లేదని, పరీక్షా కేంద్రం గేటు బయటే అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపాలన్నారు. అభ్యర్థులు తమ వెంట డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్ సరైన ఫోటో గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరు కావాలన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు నియమించిన రూట్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్ లు , లయజన్ అధికారులు సమన్వయం చేసుకొని పరీక్షలు సజావుగా నిర్వహించాలని తెలిపారు. పరీక్షా కేంద్రం చుట్టూ 360 డిగ్రీలలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల్లోనికి అభ్యర్థులు చీప్ సూపర్డెంట్ లకు, అబ్జర్వర్లకు,బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు,మరియు ఇన్విజిలేటర్లకు మాత్రమే అనుమతి ఉందని అన్నారు.

అభ్యర్ధులకు సూచనలు:

👉 పరీక్ష రోజున అభ్యర్థులు ఉదయం 08.30 నుండి 09:30 గంటల నుండి ఉదయం సెషన్‌కు మరియు మధ్యాహ్నం 01.30 నుండి 02:30 వరకు మధ్యాహ్నం సెషన్‌కు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి అనుమతించబడతారని, ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన ఎవ్వరిని లోపలికి అనుమతించడం జరగదు.

👉 ఎగ్జామ్ కు వచ్చిన అభ్యర్థులు హాల్ టికెట్ నందున్న నియమనిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు.

👉 అభ్యర్ధులు హాల్ టికెట్ తో పాటు ఒక కలర్ ఫోటో, ఒరిజినల్ ఆధార్ కార్డు/ డ్రైవింగ్ లైసెన్స్/ఉద్యోగి గుర్తింపు కార్డ్/ఓటర్ గుర్తింపు కార్డ్ ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకొని రావాల్సి ఉంటుందని అన్నారు.

👉 అభ్యర్ధులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ముందస్తుగా చూకున్నట్లైతే, పరీక్ష రోజు పరీక్ష కేంద్రానికి సులువుగా చేరుకోవచ్చు.

👉 ఎగ్జామ్ రాయడానికి (బబ్లింగ్) బ్లాక్ లేదా బ్లూ బాల్ పెన్ను మాత్రమే అనుమతిస్తారని అన్నారు.

👉 ఎగ్జామ్స్ హాల్ లోనికి మొబైల్ ఫోన్స్, ఎలాంటి వాచ్ లు, కాలిక్యులేటర్స్, వైట్ పేపర్స్, పెన్ డ్రైవ్స్, టాబ్లెట్స్, హియరింగ్ సొల్యూషన్స్ సంబంధించిన గాడ్జెట్స్ అనుమతించడం జరగదన్నారు.

👉 ఎగ్జామ్ పూర్తి అయ్యేంత వరకు ఎవ్వరిని బయటకు పంపడం జరగదని, అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రశ్నాపత్రం తమతో పాటు తీసుకువెళ్ళడానికి వీలుగా ఉంటుంది అన్నారు.

👉 పరీక్ష కేంద్రాలకు చేరుకొనే సమయంలో అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లు అయితే ఆయా పరిధిలోని పోలీస్ అధికారులకు గాని, డైయల్ 100 కు గాని సంప్రదించాలని ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది.

👉 అభ్యర్థులు ఎవరైనా మాల్ ప్రాక్టీస్, మాస్ కాపింగ్ చేసినట్లు తేలితే చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment