*బతుకమ్మ ఆటలతో..బతుకులు మారిన
-బతుకమ్మ ఆటతో నిరసన తెలుపుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు
-రోడ్లమీద ఎక్కిన మహిళ కాంట్రాక్టు ఉద్యోగులు.
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 13:
సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె నాలుగవ రోజు మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆటలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని తమని రెగ్యులర్ చేయాలని అప్పటివరకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులే తమ సమస్యల సాధనకై రోడ్డుమీద ఎక్కి బతకమ్మలు ఆడుతున్న మహిళల పట్ల నీ చిత్తశుద్ధిని నిలబెట్టుకోలేని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్ ,హర్యానా, హిమాచల్ ప్రదేశ్,ఢిల్లీ ఇతర రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మినెంట్ చేశారని తెలంగాణ రాష్ట్రమస్తే తమ 18 సంవత్సరాల సేవలను గుర్తించి రెగ్యులరైతామని అనుకున్నామన్నారు ఒకవేళ మీకు జీవో 16 హైకోర్టు ఇచ్చిన తీర్పు అడ్డొస్తే సెర్ప్,ఈజీఎస్ ఉద్యోగులకు వాలే పే స్కేల్ అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన అన్ని సౌకర్యాలను కల్పించాలని కోరారు. ఇప్పటికే కేజీబీవీ లో విద్యా బోధన బంద్ అయిందని, ఎమ్మార్సీలకు తాళాలు పడ్డాయని, అన్ని సర్వేలు బహిష్కరించామని ఉద్యోగులు తెలిపారు, తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే విద్యార్థులతో సహా రోడ్లపై బైఠాయించి సమ్మెను ఉధృతం చేస్తాం అన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు పూర్తి మద్దతు తెలుపుతూ విద్యార్థులకు విద్య నేర్పి ఉపాధ్యాయులు రోడ్లు ఎక్కడం బాధాకరమని సమస్యలు పరిష్కారం కాకుంటే విద్యార్థి సంఘాలు మద్దతిస్తూ విద్యార్థులతో సహా మీ వెంట ఉంటామని తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె మద్దతుగా
డిటిఎఫ్ బాధ్యులు విజయరామరాజు
బివిఎం రాష్ట్ర నాయకులు
విట్టల్ ఏవైసీ కామారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్,సి ఐ టి యు బాధ్యులు ఎస్ వెంకటేశం గౌడ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు భుదాం అరుణ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహులు ,సురేష్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ మహిళా అధ్యక్షురాలు వాసంతి, హరిప్రియ, మైసకల,కాళిదాస్ శైలజ,వనజ,గంగ ప్రసాద్,దినేష్ లక్ష్మణ్, శంకర్, కృష్ణ,నవీన్,లింగం, రాజు ఇతరులు పాల్గొన్నారు