-డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి డిసెంబర్ 14,
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శుక్రవారం నాడు ఎర్రవల్లి,చేబర్తి గ్రామాలలో గద్దర్ ప్రజామహాసభ కరపత్రాలను విడుదల చేశారు.సిద్దిపేట విపంచి కళా నిలయంలో ఈ నెల 15న గద్దర్ ఫౌండేషన్ అధ్వర్యంలో జరిగే ప్రజా మహాసభలో,ప్రజా యుద్ధ నౌక గద్దర్ రచించిన నాలుగు పుస్తకాలను ఆవిష్కరిస్తున్నట్లు దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు తెలిపారు.వారు మాట్లాడుతూ ఈ నెల 15న ఆదివారం ఉదయం 10 గంటలకు సిద్దిపేటలో జరిగే ప్రజా మహాసభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హరీష్ రావు,ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ,రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య,తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి,కవి,గాయకులు,ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్,మాజీ ఎమ్మెల్యే,తెలంగాణ సాంస్కృతిక సారది మాజీ చైర్మన్ రసమయి బాలకిషన్,గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి,గద్దర్ కుమారుడు జి.వి.సూర్యకిరణ్,డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్,వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటారని అన్నారు.