సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి దరఖాస్తులు హెల్ప్ డెస్క్ ద్వారా స్వీకరణ.
గ్రూప్ -02 పరీక్షలకు విధులు కేటాయించిన వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండరు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 14:
16-12-2024 సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమం పై కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ -02 పరీక్షలకు,సంబంధిత శాఖల అధికారులు విధుల్లో నిమగ్నమై ఉన్నందున.అధికారులు ప్రజావాణికి అందుబాటులో ఉండరని తెలిపారు.ప్రజలందరూ 16-12-2024 కలెక్టరేట్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ లో ప్రజావాణి దరఖాస్తులు అందజేయాలని కలెక్టర్ తెలిపారు.ఇట్టి విషయాన్ని ప్రజలందరూ గమనించి సహకరించాలన్నారు.