జిల్లాలో గ్రూప్-2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.
గ్రూప్-2 పరీక్షకు (16) కేంద్రాల్లో (5885) మంది అభ్యర్థులు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 14:
శనివారం, మెదక్ జిల్లాలో గ్రూప్ టు పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పరీక్ష ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు
చర్యలు చేపడుతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, మెడికల్ కిట్, బయోమెట్రిక్ పరికరాలు, సీసీ కెమెరాలను పర్యవేక్షించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు.తరగతి గదుల్లోని బెంచీలపై అతికించిన హాల్ టికెట్ ల నంబర్ లను అత్యంత జాగ్రత్తగా, సక్రమంగా ఉండే విధంగా సరిచూసుకోవాలన్నారు.అలాగే బ్లాక్ బోర్డుపై అభ్యర్థుల సీటింగ్ వివరాలు, పరీక్ష కేంద్రాల ముందు సూచిక వివరాల వంటి అంశాలపై సంబంధిత అధికారులను సూచనలు చేశారు.అభ్యర్థులు తికమక పడకుండా పరీక్ష కేంద్రాన్ని సూచించే విధంగా ఫ్లెక్సీ, బ్యానర్ లను సరైన విధంగా ఏర్పాటు చేయాలన్నారు.ఈ నెల 15, 16వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు నాలుగు పేపర్ల వారీగా ఈ పరీక్ష జరగనుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం (5855) మంది అభ్యర్థులు (16) పరీక్ష కేంద్రాల్లో ఈ గ్రూప్-2 పరీక్షకు హాజరుకానున్నట్లు వివరించారు. మెదక్ నియోజకవర్గంలో 11 పరీక్షా కేంద్రాలకు గాను 3,769 విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, నర్సాపూర్ నియోజకవర్గంలో 03 సెంటర్లకు గాను 1511 మంది, తూప్రాన్ లో 02 సెంటర్లకు గాను 575 మంది పరీక్షలకు హాజరవుతారని తెలిపారు.నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. పరీక్ష సమయానికి పోలీస్ సెక్యూరిటీ పగడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు.అభ్యర్థులకు ఆర్టీసీ బస్సులు సరిపడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు. అలాగే గ్రూప్-2కు హాజరయ్యే అభ్యర్థులందరికీ జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ కీలక సూచనలు.అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ ద్వారా గ్రూప్-2 హాల్ టికెట్ లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు. పరీక్షార్థులు హాల్ టికెట్ ను ఏ4 సైజ్ పేపర్ లో కలర్ ప్రింట్ తీసుకోవాలనిసూచించారు.హాల్ టికెట్ పై అభ్యర్థులు తమ తాజా పాస్ పోర్టు ఫోటోను అతికించాలన్నారు. డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్ పై ఫోటో సరిగా ముద్రించి లేకుంటే, అభ్యర్థి గెజిటెడ్ అధికారి లేదా చివరగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ తో మూడు పాస్ పోర్టు ఫోటోలతో పాటు వెబ్ సైట్ లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్ కు అందించాలని తెలిపారు.పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని,పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని,పరీక్ష రాసే అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, అభరణాలు ధరించరాదని సూచించారు. మెహిందీ, తాత్కాలిక టాటూలను వేసుకోరాదని స్పష్టం చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టికెట్ ను, బ్లూ (లేదా) బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో పాటు గుర్తింపు పొందిన ప్రభుత్వ ఒరిజినల్ ఐడెంటిటీ కార్డును తప్పనిసరిగా తమ వెంట తీసుకెళ్లాలని సూచించారు.పరీక్ష సమయ పాలనకు సూచికగా ప్రతీ అర్థగంటకోసారి బెల్ మోగుతుందని తెలిపారు.అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 9908696575 టోల్ ఫ్రీ నంబరులో* సంప్రదించి, వారి సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు.