నకిలీ కరెన్సీని తయారుచేస్తున్న ముఠా అరెస్ట్ 

నకిలీ కరెన్సీని తయారుచేస్తున్న ముఠా అరెస్ట్

తెలంగాణ కెరటం

14 డిసెంబర్

కామారెడ్డి ప్రతినిధి

 

నకిలీ కరెన్సీ తయారు చేస్తూ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సింధూశర్మ వివరాలు వెల్లడించారు. బాన్సువాడ పోలీసులు శుక్రవారం కొయ్యగుట్ట వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి కొందరు పారిపోతుండగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద రూ.30 లక్షల విలువ చేసే రూ.500 నోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్రకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి దందాకు పాల్పడుతున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన రాజగోపాల్, కర్ణాటకకు చెందిన హుసేన్ పీరా నకిలీ నోట్లు తయారీ, చలామణిలో పెట్టుబడి పెట్టారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, రమేశ్ గౌడ్, మహారాష్ట్రకు చెందిన అజయ్, ఈశ్వర్ నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారు. హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలో రూ.60 లక్షల రూ.500 నకిలీ నోట్లు ప్రింటింగ్ చేశారు. ఇందులో రూ.3లక్షలు బిచ్కుందకు చెందిన కిరణ్ కుమార్, బాన్సువాడకు చెందిన రమేశ్ గౌడ్ కు అప్పగించారు. వారు వాటిని చుట్టుపక్కల గ్రామాల్లో చలామణి చేశారు. మరో రూ.30 లక్షలను ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి రాజగోపాల్ బాన్సువాడకు వచ్చాడు. అయితే అతడిని బాన్సువాడ బస్టాండులో దింపడానికి కిరణ్ కుమార్, రమేశ్ గౌడ్ లు కారులో బయలు దేరాగా, కొయ్యగుట్ట వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల సమాచారం మేరకు హైదరాబాద్ లో తనిఖీలు చేపట్టి మిగతా రూ.26.90 లక్షల విలువైన రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజగోపాల్, హుసేన్ పీరా, కిరణ్ కుమార్, రాందాస్ గౌడ్, రాధాకృష్ణ, అజయ్ ఈశ్వర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కమలేష్, సుఖ్ రాంలు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.56 లక్షల విలువ చేసే రూ.500 నకిలీ నోట్లు, కంప్యూటర్ పరికరాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment