కామన్ మెనూ, డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవర్ …
విద్యార్థులతో కలిసి భోజనాలు చేసిన కలెక్టర్
సూర్యాపేట డిసెంబర్ 14 ( తెలంగాణ కెరటం) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా కామన్ డైట్, మెనూను కార్యక్రమాన్ని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, హుజూర్నగర్ పట్టణంలో జిల్లా కలెక్టర్ తేజాజ్ నంద్ లాల్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్టి, మైనారిటీ ఇతర స్కూల్స్ నందు విద్యార్థులకు 40% డైట్ చార్జీలు, 200% కాస్మటిక్ చార్జీలను పెంచడం జరిగిందని, చార్జీలను నాలుగు వారాలకు సంబంధించి మెనూ కూడా ఈరోజు నుంచి అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి రోజు కామన్ డైట్ ప్లాన్ తో పాటు ప్రతిరోజు స్కూల్ కి వచ్చిన సరుకులు అనగా బియ్యం, పప్పులు, కూరగాయలు, పాలు, నూనె వంటి వాటిని ఏ విధంగా సైంటిఫిక్ పద్ధతిలో నిలువ చేసుకోవాలో సూచించడం జరిగినదని అలాగే వంట చేసే పద్ధతిని కూడా తెలుసుకొని ఎంతమందికి ఎంత క్వాంటిటీ వంట చేస్తే సరిపోతుందో తెలుసుకుని వంట చేయాలని, కిచెన్లో వంట చేసేటప్పుడు వంట పాత్రలు ఎలా ఉండాలో సూపర్వైజర్లకు, ప్రిన్సిపాల్ లకు ఆదేశాలు ఇచ్చి రోజువారీగా అమలు చేయడానికి అనేక స్కూల్స్ కాలేజీలలో అమలు అమలు చేస్తున్నాం అని చెప్పడానికి పిల్లలు యొక్క తల్లిదండ్రులు ధైర్యం కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో విద్యార్థులు కూడా అందుకు అనుగుణంగా విద్యా బోధన చేయాలని దానితోపాటు నాలెడ్జ్, స్కిల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ కలిగి ఉండాలని సూచించారు. పిల్లల భవిష్యత్తు శుభ్రంగా ఉండాలంటే బట్టలు, పుస్తకాలు తో పాటు డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచడం జరిగినదని, ఉన్నత విద్య ఉంటే భవిష్యత్తులో ముందుకు వెళ్లడం జరుగుతుందని దేశ భవిష్యత్తు ముందు ముందు యువత చేతిలో ఉంటుందని కావున ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలని, భవిష్యత్తు లో ఏమి సాధించాలో దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ముందుగానే ప్రణాళిక వేసుకొని అందుకు అనుకూలంగా కృషి చేయాలని మన ఆలోచన ఎలా ఉందో మన మాటలు కూడా అలా వస్తాయని, రోజువారీ ప్రవర్తన ఎలా ఉంటే మనం నడవడిక కూడ ఇలాగే ఉంటుందని కలెక్టర్ అన్నారు. రాబోవు పదవతరగతి వార్షిక పరీక్షల్లో నూటికి నూరు శాతం డిస్టెన్స్ లో ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ విద్యార్థులను కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనాలు చేసి అందరికి డైట్, మెనూ చేర్జెస్ పంపు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ రెహనా, స్పెషల్ ఆఫీసర్ ఏ డి ఏ రమేష్ బాబు, ఎమ్మార్వో నాగార్జున రెడ్డి, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.