తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ కోటంరాజు
సూర్యాపేట జిల్లా డిసెంబర్ 15 ( తెలంగాణ కెరటం ): రాష్ట్రంలో 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ బోర్డులో పేరు నమోదు చేసుకుంటే, సుమారు 15 లక్షల మందికి రెన్యువల్ లేవని కార్మికులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ కోటంరాజు అన్నారు. స్థానిక సిఐటియు కార్యాలయం నందు జరిగిన ఆ సంఘం జనరల్ బాడీ సమావేశంలో వారు మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డులో కోకోల్లగా కోట్ల రూపాయలు ఉన్న కార్మికులకు ఖర్చు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ప్రమాదంలో మరణించిన కార్మికునికి ప్రస్తుతం ఇస్తున్న ఆరు లక్షలను 10 లక్షల పెంచాలని దాన సంస్కారాలకు కాన్పులకు వివాహ కానుకలకు ఇచ్చే 30,000 లక్ష రూపాయలకు పెంచాలని సహాయ మరణానికి ఇచ్చే లక్షణం ఐదు లక్షల పెంచాలని 60 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి 5000 రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం కార్మికులకు అడ్డాలు ఏర్పాటు చేసి అడ్డాలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ ఉపాధ్యక్షులు పల్లపు తిరుమలేష్ సహాయ కార్యదర్శి లకావత్ బాలాజీ నాయక్ జిల్లా కమిటీ సభ్యులు వల్లెపు శ్రీనివాస్ మాగి లింగయ్య రావులపెంట వెంకయ్య గంట వెంకన్న ఒగ్గు సైదులు బుచ్చిబాబు వీరబాబు గణేష్ నెహ్రు వెంకటేశ్వర్లు నాగుల్ మీరా వెంకన్న సైదులు పరశురాములు పార్వతి మంజుల తదితరులు పాల్గొన్నారు.