*చిన్నారులను అబ్బురపరిచే లా కార్వీ బేబీ ఫోటో స్టూడియో*
*సూర్యాపేట జిల్లా కేంద్రంలో అత్యధిక టెక్నాలజీతో ఏర్పాటు చేయడం అభినందనీయం*
*సూర్యాపేట జిల్లా, పరిసర ప్రాంతాల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి*
*కార్వీ బేబీ ఫోటో స్టూడియోను ప్రారంభించిన ఫోటోగ్రాఫర్ల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్*
సూర్యాపేట జిల్లా డిసెంబర్ 16 ( తెలంగాణ కెరటం)
చిన్నారులను అబ్బురపరిచి ఆకట్టుకునేలా సూర్యాపేట జిల్లా కేంద్ర నడిబొడ్డున మెడికల్ కళాశాల ఎదుట అత్యాధునిక టెక్నాలజీతో కార్వీ బేబీ ఫోటో స్టూడియోను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ఎదుట ఫోటోగ్రాఫర్ కోడం రంజిత్ కుమార్ నూతనంగా ఏర్పాటు చేసిన కార్వి బేబీ ఫోటో స్టూడియోను ఆయన ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ జిల్లా అధ్యక్షులు కూకుట్ల లాలయ్యతో కలిసి సోమవారం ప్రారంభించి మాట్లాడారు. సాధారణంగా చిన్నారులు ఫోటోలు దిగాలంటే తల్లిదండ్రులను ఫోటోగ్రాఫర్ ను ఎంతో ఇబ్బంది పెడతారని అలాంటి చిన్నారులను దృష్టిలో ఉంచుకొని వారికి నచ్చే విధంగా కొన్ని సెట్టింగ్స్ ఏర్పాటు చేసి బేబీ ఫోటో స్టూడియోను నెలకొల్పడం జరిగిందన్నారు. చిన్నారుల మొదటి పుట్టినరోజు కావచ్చు మరే ఇతర శుభకార్యమైన ఫోటోలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ రకరకాల సెట్టింగ్స్ తో పాటు రకరకాల డ్రస్సులతో అందమైన చిన్నారుల ఫోటోలు దిగే అవకాశం ఉందంటున్నారు.సూర్యాపేట ప్రాంతవాసులు, ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రో. రంజిత్ కుమార్, జిల్లా అధ్యక్షులు కూకుట్ల లాలయ్య, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు కొక్కుల శేఖర్, ప్రధాన కార్యదర్శి కూకుంట్ల శంకర్, కోశాధికారి రాపర్తి మహేష్ గౌడ్, సీనియర్ ఫోటోగ్రాఫర్స్ కొచ్చర్ల రవి, నజీర్ మిక్సింగ్ యూనిట్, సాయి రెడ్డి, పాషా, జానీ, రాము, నగేష్, వెంకట్, సురేష్, వారణాసి రమేష్, సైదులు, శేఖర్, హరి, జగదీష్, సంతోష్ రెడ్డి, ప్రభు తదితరులు పాల్గొన్నారు.