పలు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలన.

పలు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలన.

 

పరీక్షా కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) కొనసాగింపు.

 

జిల్లా వ్యాప్తంగా 16 సెంటర్ల నందు కొనసాగుతున్న గ్రూప్ 2 పరీక్షలు.

 

జవాబు పత్రాల తరలింపు వరకు పోలీసు బందోబస్తు కొనసాగింపు.

 

జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా.

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 16:

 

మెదక్ పట్టణంలోని వివిధ గ్రూప్ 2 పరీక్ష కేంద్రాలను పరిశీలించి అక్కడి సిబ్బంధికి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెండవ రోజు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్న గ్రూప్-2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జిల్లా లోని 16 కేంద్రాల నందు కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. రెండవ రోజు పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.పరీక్షా కేంద్రాల లోపల మరియు పరిసర ప్రాంతాల నందు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమల్లో ఉందని తెలిపారు. ఎలాంటి సభలు ర్యాలీలు సమావేశాలకు అనుమతులు లేవని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తూ నిరంతరం పెట్రోలింగ్ గస్తీ నిర్వహిస్తుండాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment