ప్రజావాణి కి 21 దరఖాస్తులు,
ప్రజావాణి వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్,
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 16):
సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి 21 ఫిర్యాదులు వచ్చాయని .. అట్టి అర్జీలను వెంటనే పరిశీలించి సత్వరమే పరిష్కారం చేయాలని సంబంధితశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఏడి సర్వే ల్యాండ్ కు 3 పిర్యాదులు, డిఆర్డిఏకు 2, ఉపాధి కల్పనకు 2, జిల్లా శిశు సంక్షేమ శాఖకు 2, విద్యాశాఖ, లేబర్, ఎల్డీఎం, పోలీస్ శాఖలకు సంబంధించి ఒక్కొక్క ఫిర్యాదు అందాగా మిగిలిన ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులుగా తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, కలెక్టరేట్ విభాగాల సూపరిండెంట్ చేన్న కిష్టయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.