---Advertisement---

ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎర్తింగ్ వైర్ షాక్ తగిలి గేదె మృతి

---Advertisement---

ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎర్తింగ్ వైర్ షాక్ తగిలి గేదె మృతి

 

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 15

 

నారాయణఖేడ్ మండల పరిధిలోని కొండాపూర్ హనుమాన్ మందిర్ తాండకు చెందినటువంటి రాథోడ్ లక్ష్మీబాయి భర్త మాణిక్ నాయక్ గారి గేదె శనివారం రోజున సాయంత్రం తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎర్తింగ్ వైర్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఎప్పటిలాగే తన వ్యవసాయ క్షేత్రంలోనే తాడుతో మెయడానికి కట్టి వేసేవారు. తాడు తెంపుకొని ట్రాన్స్ఫార్మర్ ఏర్తింగ్ కి షాక్ తగిలి చనిపోవడం జరిగినది. కూలి పనులకు వెళ్లి సాయంత్రం వచ్చి చూసేసరికి చనిపోయి ఉంది. వాళ్ల కుటుంబం యొక్క ఆధారం జీవనోపాధి గేదెలు పోషణం పైన జీవనం సాగిస్తూ ఉండేవారు. వారం రోజుల్లో ఈనడానికి నిండు సూలు ఉండేటటువంటి గేదె చనిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.దాదాపు గేదె విలువ 80,000 గా ఉంటుందని చెప్పారు ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకోవాలని లక్ష్మి బాయి భర్త మాణిక్ నాయక్ ప్రభుత్వానికి మరియు అధికారులను విన్నవించుకున్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment