జిల్లా విద్యాధికారి శ్రీనివాస్తె రెడ్డి
మండల విద్యాధికారి వెంకటరాములు
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి డిసెంబర్ 16,
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని పలు గ్రామాల పాఠశాలలను సోమవారం రోజు సిద్దిపేట జిల్లా విద్యాశాఖాధికారి ఈ.శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు.మొదటగా మర్కుక్ ఎంపీపీస్ మరియు భావనందాపూర్ ను మండల విద్యాధికారి వెంకట్ రాములుతో కలసి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువులో బాగా వెనకబడి ఉన్నారని,వారి పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవడానికి సూచనలు చేశారు.విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇంకా మెరుగైన విదంగా అందించాలని సూచనలు చేశారు.బియ్యం పట్ల తగు జాగ్రత్త తీసుకొని,పురుగులు లేకుండా చూడాలన్నారు.ముక్కిపోయిన,పురుగు పట్టిన బియ్యం వాపస్ చేయాలి అని తెలిపారు.అనంతరం కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసి,పిల్లలతో కలసి భోజనం చేసారు.పిల్లలకు ఇంకా నాణ్యమైన భోజనం అందించాలని,పలు సూచనలు చేసారు.మజ్జిగ,టీ క్వాలిటీగా ఉండాలన్నారు.టిఫిన్స్ ఇంకా క్వాలిటీ గా ఉండాలని తెలిపారు.పిల్లల సమస్యలు అడిగి తెలుసుకొని,వెంటనే మండల విద్యాధికారి కి సూచనలు చేశారు.10వ తరగతి పిల్లలకు ఫిజిక్స్ టీచర్ లేనందున జిల్లా పరిషత్ టీచర్స్ తో సిలబస్ పూర్తి చేయుటకు ఆదేశించారు.