---Advertisement---

పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

---Advertisement---

పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

 

– జిల్లా విద్యాధికారి కె.రాము

 

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 17 : పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాధికారి కె.రాము అన్నారు. కోరుట్ల కాల్వగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత (బాలుర) పాఠశాలలో మంగళవారం రోజున పాఠశాల కాంప్లెక్స్ స్థాయి మీటింగ్ సమావేశానికి జిల్లా విద్యాధికారి కె.రాము హజరయ్యారు. ఈ సమావేశంలో విద్యాధికారి రాము మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి విద్య బలపడాలంటే ఉపాధ్యాయులు పిల్లల స్థాయిని గుర్తించి తగువిధంగా విద్యాబోధన జరిగే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. యూపి లెవెల్ లో ఆంగ్ల ఉపాధ్యాయుల ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా ఆంగ్లంలో మాట్లాడే విధంగా బోధన చేస్తూ, అదే విధంగా 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ వహించి పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అడ్డగట్ల శ్రీనివాస్, మండల విద్యాధికారి గంగుల నరేష్, ఎంఎన్ఓ మార్గం రాజేంద్రప్రసాద్, సెక్టోరియల్ ఆఫీసర్ రాజేశం, రిసోర్స్ పర్సన్స్ పాటిల్ ధరమ్ దీప్, శివప్రసాద్, మహేష్ ,దామోదర్, రణధీర్, హరినాథ్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment