---Advertisement---

సైన్స్‌ పట్ల ఆసక్తి పెంచేలా తరగతి గదిలో బోధన జరగాలి.

---Advertisement---

సైన్స్‌ పట్ల ఆసక్తి పెంచేలా తరగతి గదిలో బోధన జరగాలి.

 

తరగతి గదిలో ఉపాధ్యాయుడి బోధన ప్రవర్తనను బట్టే విద్యార్థుల విద్యా ప్రమాణాలు ముడిపడి ఉంటాయి,

 

డిఇఓ రమేష్ కుమార్.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 17):

 

సైన్స్‌, గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలలో పట్టు ఉన్నప్పుడే సాంకేతిక ప్రగతి సాధ్యపడుతుందని అందుకు అనుగుణంగానే బయో సైన్స్, ఫిజికల్ సైన్స్,ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో సైన్స్‌ పట్ల ఆసక్తి పెంచేలా ప్రయోగాలతో విద్యాబోధన జరగాలని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు.జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సైన్స్ అకాడమీ మరియు టెక్ మహేంద్ర వారు సంయుక్తంగా నిర్వహించిన జీవశాస్త్ర మరియు భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుల ప్రయోగాలపై శిక్షణా కార్యక్రమాన్ని నవంబర్లో ఐదు రోజులపాటు నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గొన్న సైన్స్ఉపాధ్యాయులకు మంగళవారం నాగర్ కర్నూల్ పట్టణంలోని సైన్స్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో 73 మంది సైన్స్ ఉపాధ్యాయులకు తరగతి గదిలో వినియోగించే సైన్స్ కిట్లు పంపిణీకి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ హాజరై మాట్లాడుతూసైన్స్ ఉపాధ్యాయులు ప్రయోగ కృత్యంతో బోధిస్తే విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందే విధంగా ఉంటుందని, విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ పెంచుకొని బావి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి అవకాశం ఉందన్నారు. సైన్స్‌ ప్రయోగశాలల ద్వారా విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానం పట్ల జిజ్ఞాసను సైన్స్ అధ్యాపకులే పెంచాలన్నారు. విద్యార్థులలో మేధస్సును పెంచి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నారు.తరగతి గదిలోఉపాధ్యాయుడి భోధన ప్రవర్తనను బట్టి విద్యార్థుల విద్య ప్రమాణాలు ముడిపడి ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు షర్ఫుద్దీన్, నూరుద్దీన్, శోభారాణి జీవశాస్త్ర ఫోరం సభ్యులు శేఖర్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి ఎఫ్ పి ఎస్ టి సభ్యులు నాగరాజు, కృష్ణారెడ్డి, సైన్స్ అకాడమీ సభ్యులు సత్యానంద్, రేవతి, అమీర్ మరియు వివిధ పాఠశాలల సైన్సు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment