యాప్స్ ద్వారా ఆన్లైన్లో ఒక్క లక్ష ఇరవై వేల రూపాయలు అప్పు తీర్చలేక మృతి. 

యాప్స్ ద్వారా ఆన్లైన్లో ఒక్క లక్ష ఇరవై వేల రూపాయలు అప్పు తీర్చలేక మృతి.

 

కాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్ అక్కన్నపేట అడవిలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

 

రామాయంపేట ఏఎస్ఐ రవీందర్ తెలిపారు.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 17:

 

మెదక్ జిల్లా రామాయంపేట మండలం క్యాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్ తండ్రి కిషన్ వయసు 31 సంవత్సరాలు, కుల ముదిరాజ్, వృత్తి మిషన్ భగీరథ పంప్ ఆపరేటర్ గా గత నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అతనికి మనీష్ నాలుగు సంవత్సరాల కొడుకు మరియు నిహార్ రెండు సంవత్సరాల కొడుకు సంతానం కలదు. మృతుడు గంగాధర్ లోన్ యాప్స్ ద్వారా ఆన్లైన్లో 1,20,000 సంవత్సరం క్రితం అప్పు చేయగా వారి కుటుంబ సభ్యులు అప్పు చెల్లించినారు. ఆ తర్వాత అతడు మళ్లీ లోన్ యాప్స్ ద్వారా మూడు లక్షల అప్పు చేసి వాటిని తీర్చలేక మనస్థాపం చెంది తేదీ 25.12.24 నాడు మధ్యాహ్నం రెండు గంటలకి అక్కన్నపేట్ అడివిలో గడ్డి మందు తాగగా అతన్ని వారి కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఎల్లారెడ్డిపేట అశ్విని ఆసుపత్రి తీసుకెళ్లి అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం నిజాంబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లి నిన్న రాత్రి 9 గంటలకు అడ్మిట్ చేసినారు. అక్కడ మృతుడు చికిత్స పొందుతూ నిన్న తేది 16 12 2024 నాడు రాత్రి పదిన్నర గంటలకు చనిపోయినాడు అని మృతుని తమ్ముడు ప్రశాంత్ దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనది. ఏఎస్ఐ రవీందర్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment