ఖేడ్ మా సింగూరు మా నీళ్లు అంటూ అసెంబ్లీలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే
తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 17
ఎండా కాలంలో నారాయణఖేడ్ ప్రజలు నీళ్ల కోసం ఇబ్బంది పడుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ భగీరథ మొత్తం విఫలమైందన్నారు. సింగూరు నీళ్లు ఎండాకాలంలో తాగుకు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఖేడ్ పరివాహక ప్రాంతం ఇక్కడ భూములు కోల్పోయినప్పటికీ కూడా నీళ్లు మాకే అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగకంగ్టి మండల పరిధిలోని తడ్కల్ను మండల్గా ప్రకటించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. అతి పెద్ద మండలం కంగ్జి అని పేర్కొన్నారు. 14 గ్రామ పంచాయతీలతో గత ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టినప్పటికీ ప్రకటించి ఆపేశారన్నారు. తక్షణమే తడ్కల్ను మండలం ప్రకటించాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వలే కాకుండా తక్షణమే స్పందించాలన్నారు.