బదిలీ పై వెళ్లిన ఎంఈఓ కు ఘనంగా వీడ్కోలు సన్మానం
తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి డిసెంబర్
బెజ్జంకి మండల విద్యాధికారి గా విధులు నిర్వహించి, ఇటీవల చిగురుమామిడి మండలానికి బదిలీపై వెళ్లిన ఎంఈఓ వి. పావని ని మండలంలోని ఉపాధ్యాయుల సమక్షంలో మెమెంటో మరియు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా
ప్రస్తుత ఎంఈఓ మహతిలక్ష్మీ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు దేశ ప్రగతికి రథ చక్రాలవలె పనిచేస్తారని, మండల విద్యాధికారి గా పావని గారి సేవలను ఆదర్శంగా తీసుకొని విద్యాభివృద్ధికి శ్రమించాలని ఆకాంక్షించారు. ఆమె బెజ్జంకి ఎంఈఓ గా ఉన్న సమయంలో ఉపాధ్యాయులందరిని, సమన్వయం చేసుకుంటూ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి మండల విద్యాభివృద్ధిలో కీలక పాత్ర వహించారని అన్నారు. ఆమె నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల మండలం విద్యారంగంలో అభివృద్ధి పథంలో ముందంజ వేసిందని, ఉపాధ్యాయులు పావని గారి బదిలీకి విచారం వ్యక్తం చేస్తూ, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు బెజ్జంకి మండలానికి సేవలందించాలని కోరారు. ఆమె చేసిన అమూల్యమైన సేవలను ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గోపికృష్ణ, కె. శ్రీరాములు, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండలంలోని ఉపాధ్యాయులు, విద్యా వనరుల కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.