డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టి డబ్బులు కాజేస్తారు జాగ్రత్తా: సిర్గాపూర్ ఎస్ ఐ
తెలంగాణ కెరటం: సిర్గాపూర్ నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 17
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిబిఐ నుండి మాట్లాడుతున్నాం,ఇడి నుండి మట్లాడుతున్నం అని మీ నంబర్ డ్రగ్స్ కేసు లో ఉన్నది, మీ డిజిటల్ అరెస్టు అయినారు అని మేము చెప్పింది చేయాలి అని అవతల సిబిఐ ఆఫీసర్ అని చెప్పి యూనిఫాం లోనే మాట్లాడుతాడు ,మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్,ఓటీపీ వివరాలు చెప్పుమంటారు లేదా అకౌంట్ నంబర్ కి ట్రాన్సఫర్ చేయమంటారు.ఎవరికి చెప్పొద్దూ వాళ్ళు టెన్షన్ పడుతారు అని మనల్ని భయపెట్టి డబ్బులు ట్రాన్సఫర్ చేయించుకుంటారు. ఇట్లాంటి సంఘటన ఈ రోజు సిర్గాపూర్ లోని జరిగింది. ముత్యపు సందీప్ వ్యక్తి కి సీబీఐ ఆఫీసర్ అని యూనిఫాం తో ఉన్న వ్యక్తి వాట్సప్ వీడియో కాల్ చేసి మీ నంబర్ డ్రగ్స్ కేసు లో ఉంది మిరు డిజిటల్ అరెస్టు అయ్యారు మిమ్మల్ని విచారించాలని డోర్స్ అన్ని దగ్గర పెట్టి మాట్లాడాలి అని చెప్పి ఇతని ఆధార్, పాన్ వివరాలు అడిగాడు వెంటనే తండ్రి గుర్తించి సందీప్ నీ పీస్ కి తీసుకురావడం తో అన్ని కాల్స్ నీ బ్లాక్ చేయడం తో అతని అకౌంట్ లో ఉన్న 2 లక్షలు రూపాయల ను అపగలిగాం లేకుంటే భయపడి ఓటీపీ కూడా చెప్పేవారు. కావున దయచేసి ఎవరు కూడా డిజిటల్ అరెస్టు అంటే బయపడవద్దు, వివరాలు చెప్పవద్దు విజ్ఞప్తి చేస్తున్నాం ,ఇదంతా డబ్బుల కోసం సైబర్ నేరగాళ్లు చేసే పని.