ప్రతిభావంతులైన క్రీడాకారులకు నెలవు మెదక్ జిల్లా

ప్రతిభావంతులైన క్రీడాకారులకు నెలవు మెదక్ జిల్లా

 

మెదక్ జిల్లా పేరును క్రీడలలో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలపాలి కలెక్టర్.

 

ఓటమి గెలుపుకు నాంది క్రీడాకారులు నిరుత్సాహాన్ని పక్కనపెట్టి క్రీడలలో పాల్గొనటం ప్రతిభకు పరీక్ష గా భావించాలి ఎస్పీ ఉదయ్ కుమార్.

సీఎం కప్ క్రీడాజ్యోతిని ప్రారంభించిన కలెక్టర్ రాహుల్ రాజ్,జిల్లా ఎస్పీఉదయ్ కుమార్.

రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికే సీఎం కప్.

 

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 17:

గ్రామీణ స్థాయి నుండి యువ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడా పోటీలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్,ఎస్పీ ఉదయకుమార్, జిల్లా క్రీడల నిర్వహణ అధికారి నాగరాజు, డీఎఫ్ఓ జోజి, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, డి పి ఆర్ ఓ రామచంద్ర రాజు తో కలిసి జిల్లా కలెక్టర్ క్రీడోత్సవాలకు సంబంధించిన క్రీడాజ్యోతి వెలిగించి క్రీడా పోటీలను ప్రారంభించారు.ఈ సందర్బంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు సీఎం కప్గురించి చైతన్యం కల్పించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి ఎక్కువ క్రీడాకారులు పాల్గొనే విధంగా అవగాహన కల్పించామని.మన జిల్లా నుండి, రాష్ట్రస్థాయి నుండి ప్రపంచ స్థాయిలో రాణించే విధంగా క్రీడాకారులు తయారు కావాలని, ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని క్రీడల్లో మన జిల్లాకు,పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు.గ్రామీణ,మండల స్థాయి నుండి యువత పెద్ద ఎత్తున సీఎం కప్ క్రీడలలో పాల్గొని విజయవంతం జిల్లా స్థాయికి చేరుకోవడం జరిగిందని అన్నారు.ప్రభుత్వం విద్యా వైద్యం తో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత నిస్తుందని క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడా పాఠశాలలు క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కవులు కళాకారులతోపాటు క్రీడాకారులకు కూడా సముచిత స్థానం కల్పించడం శుభ పరిణామంగా పేర్కొన్నారు.తెలంగాణ స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతిభావంతులైన క్రీడాకారులుగా తయారు కావాలని ఆకాంక్షించారు.జిల్లాస్థాయిలో క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రస్థాయిలో క్రీడా పోటీల్లో పాల్గొనే అవకాశం వస్తుందని మెదక్ జిల్లా పేరును క్రీడలలో ప్రథమ స్థానంలో నిలపాలని, ఆకాంక్షించారు. మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఓటమి గెలుపుకు నాంది పలుకుతుందని క్రీడాకారులు ఎవరు ఓడిపోయామనినిరుత్సాహపడకుండా క్రీడలలో పాల్గొన్నందుకు ప్రతిభకు పరీక్షగా భావించాలని, క్రీడలు శారీరక మానసిక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని దైనందిక జీవితంలో వ్యాయామంపై శ్రద్ధ వహించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మించే దిశగా కృషి చేయాలన్నారు.ప్రతిభావంతమైన క్రీడాకారులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా స్థాయి క్రీడా పోటీలకు వాలీబాల్ క్రీడలలో పురుషుల విభాగంలో 25 టీంలు,మహిళల విభాగంలో 14 టీంలు, కబడ్డీ క్రీడలో పురుషుల విభాగంలో 25 టీంలు, మహిళల విభాగంలో 24 టీంలు పోటీల్లో పాల్గొంటున్నారని కలెక్టర్ వివరించారు. క్రీడలలో పాల్గొనే వారందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అనంతరం వాలీబాల్ క్రీడను జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పీడీల సంఘం సెక్రెటరీ శ్రీనివాసరావు,పీడీలు శ్రీధర్ రెడ్డి ,మాధవరెడ్డి,రమేష్, రాజేందర్, సంబంధిత వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment