ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆఫీసు రికార్డులు తనిఖీ చేసిన 

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆఫీసు రికార్డులు తనిఖీ చేసిన 

నోడల్ అధికారి షేక్ సలాం

 

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 18:

 

కామారెడ్డి జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం ఆఫీసు రికార్డులు తనిఖీ చేశారు.మరియు కళాశాల సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో లెక్చరర్స్ అందరూ విద్యార్థులకు పాఠాలు చాలా ఇష్టంగా బాధ్యతగా నిబద్ధతతో బోధించాలని కళాశాల అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. కళాశాలలో అడ్మిషన్స్ మరియు ఈ సంవత్సరము ఐపిఈ రిజల్ట్ కూడా పెంచే విధంగా స్టడీ అవర్స్ నిర్వహించాలని తెలిపారు. అధ్యాపక బృందం యొక్క కష్టపడే తత్వము మరియు పనితీరు వలన జిల్లాకు మంచి పేరు వస్తుందని తెలిపి అధ్యాపకులలో ఉత్సాహాన్ని నింపారు.కళాశాల ప్రిన్సిపల్ ఏ జయకుమారి కళాశాలలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల గురించి తెలిపారు.మరియు కళాశాల యొక్క అడ్మిషన్లు పెంచడానికి తీసుకున్న చర్యలు మరియు రిజల్ట్ పెంచడానికి తీసుకున్నటువంటి చర్యలు వివరించారు ఇట్టి కార్యక్రమంలో కళాశాల సిబ్బంది ఇర్ఫాన,విజయ, ప్రవీణ,ఫణి కుమార్,సంతోష్ రెడ్డి, వెంకట్ నాయక్, వేణు,సంతోష్, నాగేశ్వర్ యోగిత,పద్మ, సాయినాథ్,సుజాత, నసీం సుల్తానా,రాజు, పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment