బ్రహ్మా కుమారీస్ కోరుట్ల సేవాకేంద్రం రజతోత్సవాలు ప్రారంభం
రాజయోగిని బ్రహ్మా కుమారీ కుల్దీప్ దీదీజికి ఘనస్వాగతం
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 18 :
ప్రజాపిత బ్రహ్మా కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం, కోరుట్ల శాఖ రజతోత్సవాల సందర్భంగా సంస్థ హైదరాబాద్ సబ్ జోన్ ఇన్ చార్జ్ రాజయోగిని బ్రహ్మా కుమారీ కుల్దీప్ దీదీజీ కోరుట్ల నగరానికి విచ్చేయగా నగరంలోని నంది చౌక్ వద్ద మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్ దంపతులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. వారితో పాటు బ్రహ్మా కుమారీస్ కోరుట్ల శాఖ ఇన్ చార్జ్ బి.కే రాజేశ్వరి, కరీంనగర్ బ్రహ్మా కుమారీస్ ఇన్ చార్జ్ రాజయోగిని బ్రహ్మా కుమారీ విజయ అక్కయ్య, సంస్థ సేవాధారులు, సభ్యులు పుష్ప గుచ్ఛాలను సమర్పించి స్వాగతం పలికారు. అనంతరం స్వాగత గానాలు, సందేశాత్మక గీతాల శకటం, శివ ధ్వజాలతో అలంకరించిన మోటర్ సైకిళ్ళ స్వాగత ర్యాలీతో దీదీజీని సంస్థ సభ్యులు కల్లూర్ లోని శివ సాయి ప్రెస్టీజ్ పార్క్ లో నిర్మించిన విశ్వ కల్యాణి భవనమునకు తీసుకెళ్లారు. పార్క్ గేట్ నుండి సేవాకేంద్రం వరకు కలశాలు, బతుకమ్మ ఆటలతో,పంచ తత్వాల వేషధారణతో సంస్థ సభ్యులు శోభయాత్రతో స్వాగతం పలికారు.