---Advertisement---

ముంబై మహానగరంలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆవిర్భావం

---Advertisement---

ముంబై మహానగరంలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆవిర్భావం

 

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 18 :

 

మూఢనమ్మకాల నిర్మూలన సంఘం (ఎంఎన్ఎస్) ఫౌండర్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ బైరి నరేష్ ముంబై పర్యటన చేసిన విషయం విధితమే. ఆదివారం ముంబై దాదర్లో ఎం.ఎన్.ఎస్ మహారాష్ట్ర సమావేశం జరిగింది. అందులో 50మంది క్రియాశీలక సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరితో చర్చించి నూతన కమిటీని ప్రతిపాదించారు. అనంతరం 2రోజులు రివ్యూ చేసి ఎంఎన్ఎస్ వ్యవస్థాపకులు జాతీయ సమన్వయకర్త గాండ్ల సుజాత టీచర్, బైరి నరేష్ సమగ్రంగా చర్చించి బుధవారం అధికారికంగా ఎంఎన్ఎస్ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. వివరాలు ఇలా రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా బాలబోయిన రాంప్రసాద్, రాష్ట్ర అధ్యక్షులు ముత్యాల రవీందర్, ప్రధాన కార్యదర్శి అక్కెనపల్లి దుర్గేష్, సంయుక్త కార్యదర్శి గుండ్లపల్లి ఉపేందర్, సహాయ కార్యదర్శి గద్దపాటి సాయికృష్ణ, ఉపాధ్యక్షులు చౌవల్ రమేష్, ఏర్పుల శంకర్, ప్రచార కార్యదర్శిలు గద్దపాటి నగేష్, నారపాక లక్ష్మణ్, అధికార ప్రతినిధి వడ్డీ సూర్యనారాయణ, భీంరత్న మాలజీ, కోశాధికారి బొమ్మ రాములు, కార్యవర్గ సభ్యులు బత్తుల లింగరాజు, రాష్ట్ర సలహాదారులు మూలనివాసి మాలజీ, సిరిపంగి రవీందర్, మాంకాల కృష్ణ, కట్ట రాజు లతో ఏర్పాటైంది. ఇది ఏడాది పాటు లేదా రాష్ట్ర మహాసభలలో నూతన కమిటీని ఎన్నుకునే వరకు సాగుతుందని నరేష్ తెలిపారు . సభ్యులందరు నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కమిటీ నాయకత్వంలో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలో మూఢనమ్మకాల నిర్మూలనకు కృషిచేసిన దివంగత నరేంద్ర దాబోల్కర్ స్ఫూర్తితో ఫూలే, షాహు, అంబేడ్కర్ల మార్గంలో ఈ కమిటీ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment