ఉపాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాల
బాల్కొండ మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ వెల్లడి
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 18 :
ఉపాధ్యాయులందరు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయు లంతా బాధ్యతగా, అంకిత భావంతో పనిచేయాలని,ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులందరూ తరగతి గదిలో అనుసరించవలసిన బోధనా పద్ధతులను, బోధనోపకరణాలను తయారు చేసుకుని ప్రదర్శనగా ఉంచాలన్నారు. నూతన బోధనా పద్ధతులను, సాంకేతికతను ఉపయోగించి తమ వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ సమావేశాలు ఉపయోగపడతాయని విద్యార్థులకు పాఠ్యాంశా లు ప్రణాళికా బద్ధంగా బోధించాలని, అందుకు అవసరమైన టీఎల్ఎం, లెసెన్ప్లాన్ లు, వార్షిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉత్తమ విద్యాబోధన ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులను తయారు చేయడంలో ఉపాధ్యాయులు కార్యోన్ముఖులు కావాలని నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ సూచించారు ప్రాథమిక పాఠశాలల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను, మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో జరుగుతున్న ప్రాథమిక ఉన్నత పాఠశాల తెలుగు కాంప్లెక్స్ సమావేశాలను పర్యవేక్షించారు, ఈ కార్యక్రమంలో కిసాన్ నగర్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రాజేంద్ర కుమార్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ఇంచార్జ్ ఇంచార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, రామస్వామి, శ్రీలక్ష్మి, నాగల రాజేందర్ గౌడ్, కోకిల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.