కమ్మర్ పల్లి మండల కేంద్రంలో దొంగల బీభత్సం
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 18 :
నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రంలో హస కొత్తూరు గ్రామానికి వెళ్లే రోడ్డు గుండా గల రెండు ఇళ్లలో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడి బీభత్సం సృష్టించారు. బాధితుల, పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. కమ్మర్ పల్లి మండల కేంద్రంలోగల, కలల శ్రీలేఖ హస కొత్తూరు గ్రామానికి వెళ్లే రోడ్డు ప్రాంతంలో గల సిరిగిరి శ్రీనివాస్ ఇంట్లో నివాసం ఉంటున్నారు. కలల శ్రీలేఖ16-12-2024, సోమవారం రోజున ఇంటికి తాళం వేసి ఆమె తల్లిగారి గ్రామమైన ఖానాపూర్ కు వెళ్ళింది. తల్లి గారిఇంటి నుండి బుధవారంరోజు ఉదయంవచ్చి చూసే సరికి దొంగలు ఇంటి తాళం పగలగొట్టి, ఇంట్లోకి చొరబడి, ఇంట్లో గల బీరువాను పగలగొట్టి,బీరువాలో నుండి అరతుల బంగారంఉంగరం,18, తులాలవెండి అభరణాలు,కొంత నగదును దోచుకుపోయారని కలల శ్రీలేఖ రోదిస్తూ వాపోయారు. అదేవిధంగా ప్రక్కనే గల తిరిగి శ్రీనివాస్, చింత గణేష్ ఇంటి తాళాలు సైతం పగలగొట్టి ఇంట్లోకిచొరబడ్డారు. ఆ రెండు ఇండ్లలో ఏమి దొరక లేకపోవడంతో గుర్తు తెలియని దొంగలు దొరికిన కాడికి కలల శ్రీలేఖ ఇంట్లో నుండి దోచుకు వెళ్లారని వాపోయారు.రెండు ఇండ్లలోదొంగలు తాళాలు పగలగొట్టి చొరబడినప్పటికీ, దొంగతనం జరగలేదని ఆ రెండు ఇంటి యజమానులు పేర్కొన్నారు. కలల శ్రీలేఖ దొంగతనం లో పోయినబంగారం వెండి,నగదు పై కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ,కమ్మర్ పల్లి ఎస్సై,జి. అనిల్ రెడ్డి, భీంగల్ సిఐ నవీన్ కుమార్ దొంగతనం జరిగిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.శ్రీలేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు, భీంగల్ సిఐ నవీన్ కుమార్, ఎస్సై,జి.అనిల్ రెడ్డి తెలిపారు.