ఖేడ్: బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ యువకులు
తెలంగాణ కెరటం నారాయణాఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసంబర్ 18
సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలం మావినెల్లి గ్రామానికి చెందిన సుమారు 20 మంది యువకులు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఖేడ్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యాలయంలో ఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లోకి చేరారు. చేరిన వారిలో దత్తు సాగర్, శివకుమార్, సంగమేష్, సంగప్ప తదితరులు ఉన్నారు.