వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ ను కలిసిన మర్మాముల రైతులు.

వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ ను కలిసిన మర్మాముల రైతులు.

 

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి డిసెంబర్(19).

 

 

మద్దూరు మండలంలోని మర్మాముల, బంజేరు గ్రామ రైతులు తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. త్వరలో ప్రభుత్వం తీసుకురానున్న ఆర్ ఓ ఆర్ చట్టంలో సాదా బైనమా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లను కొన్ని సంవత్సరాల క్రితం క్రయం పొందిన రైతులు వ్రాయించుకున్న పత్రాలను ఆయనకు అందజేసి సమస్యను వివరించారు. ఎన్నో ఏండ్లుగా సాదా కాగితాలతో కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న తమకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసి న్యాయం చేయాలని వేడుకున్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో భూభారతి తీసుకురావడం సంతోషకరమన్నారు. ఈకార్యక్రమంలో రైతులు ఇప్ప నిస్కాంత్ రెడ్డి, జంగిలి యాదగిరి, జంగిలి భిక్షపతి,రాసురి ఉప్పలయ్య, గుడిసె యాదగిరి, మీస ఆంజనేయులు, జంగిలి మల్లేశం, జంగిలి సాయిలు, రాసురి ఉపేందర్, రాసురి బీరయ్య, గుడిసె సత్తయ్య, మీస సిద్దిలింగం, తదితరులు పాల్గొన్నారు…

Join WhatsApp

Join Now

Leave a Comment