---Advertisement---

సిఆర్టి లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.

---Advertisement---

సిఆర్టి లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.

తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎం శంకర్ నాయక్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 21):

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం ముందు 48 గంటల నిరవధిక సమ్మె చేపట్టిన పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్టి ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని సమ్మె చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులస్తులకు తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎం శంకర్ నాయక్ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వలన కేసీఆర్ ప్రభుత్వానికి కార్మికులు ఉద్యోగులు నిరుద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగులు అందరూ కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారని. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరి సమస్యలు పరిష్కారం అవుతాయని సమన్యాయం జరుగుతుందని భావించారని. సంవత్సర కాలం పూర్తి అయిన ఎవరి సమస్య పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం తగదని ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో సీఆర్పీలుగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగుల 13 ఏళ్ల నుంచి పనిచేస్తున్న కనీసం కుటుంబం గడిచే జీతాలు కూడా లేక కుటుంబమంతా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సిఆర్టి ల పక్షాన ఆలోచన చేయాలని డిమాండ్ల పరిష్కారం కోసం కృషి చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. జీవిత బీమా సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యము కల్పించాలని, డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సిఆర్టిలకు కూడా అన్ని రకాల సౌకర్యాలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వారు చేసే ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గిరిజన సంఘం అండగా ఉంటుందని తెలుపుతూ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఆర్టి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజగోపాల్, నాయకులు ఆంజనేయులు నోకియా నరేష్ భరత్ రాజు సరళ లక్ష్మి కవిత తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment