శ్రీ సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాత దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 21:
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల తండాలో శనివారం శ్రీ సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాత దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ దేవాలయం నాల్గవ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో నవగ్రహ పూజ, గణపతి హోమం నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాత విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. గిరిజన సంప్రదాయంలో మహిళలు నృత్యం చేస్తూ భక్తి గీతాలు ఆలపిస్తూ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.