గిరిజన బిడ్డలకు దక్కిన అపూర్వ గౌరవం.

గిరిజన బిడ్డలకు దక్కిన అపూర్వ గౌరవం.

నేషనల్ బాల రంగ్ ఫెస్టివల్ కు తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం చేసిన పాపన్నపేట విద్యార్థులు.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 21:

వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు విలువలు అందరికీ విస్తరించాలన్న ఉద్దేశంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో నేషనల్ బాల రంగ్ ఫెస్టివల్ ను డిసెంబర్ 21 ,22 తేదీలలో నిర్వహించడం జరిగింది. ఈ సాంస్కృతిక వేడుకకు తెలంగాణ రాష్ట్రం నుండి మెదక్ జిల్లా పాపన్నపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు గిరిజన సంప్రదాయాన్ని నృత్య రూపంలో ప్రదర్శించారు .చక్కని వేషధారణతో విద్యార్థులు ఆకట్టుకున్నారు.ఎలాంటి రికార్డింగ్ ను వాడకుండా విద్యార్థులే వాయిద్యాలను వాయిస్తూ, సేవాలాల్ పాట పాడుతూ తీజ్ పండుగ ప్రాశస్త్యాన్ని ప్రదర్శించారు.
మొత్తం 29 రాష్ట్రాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు.
వారి వెంట రాష్ట్ర కల్చరర్ కో ఆర్డినేటర్ గిరి ,ఈ నృత్యానికి కొరియోగ్రఫీ చేసిన తెలుగు ఉపాధ్యాయులు అంజాగౌడ్ , ఉపాధ్యాయులు కృష్ణ కాంత్ , ఇందిర ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ మాట్లాడుతూ జాతీయ స్థాయి లో నృత్య ప్రదర్శన చేసే అవకాశం రావడం పాఠశాలకు దక్కిన అపూర్వమైన గౌరవమని అన్నారు.జాతీయ స్థాయిలో నృత్య ప్రదర్శన చేసిన విద్యార్థులను జిల్లా విద్యాశాఖాధికారి రాదాకిషన్,ఏఎంవో సుదర్శన మూర్తి,మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి,మండల విద్యాభిమానులు అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment