గణిత ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన కాటా సుధా శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ కెరటం డిసెంబర్ 21 అమీన్ పూర్ మండలం పటాన్ చెరువు ప్రతినిధి
అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీ గౌతమ్ మోడల్ స్కూల్‌లో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన గణిత ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గణితశాస్త్రం విద్యార్థుల బౌద్ధిక వికాసానికి ముఖ్యమని ఇలాంటి ప్రదర్శనలు వారిలో ఆవిష్కరణాత్మక ఆలోచనలను సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను గణిత ప్రదర్శనల ద్వారా ప్రదర్శించారు.