హైదరాబాద్ సమావేశానికి బయలుదేరిన ఏడిఎంఎస్ జగిత్యాల జిల్లా ప్రతినిధులు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 21 : ఏడిఎంఎస్ 04 కమిటీ సభ్యులు రచ్చ శ్రీనివాస్ నేతృత్వంలో సంస్థ ప్రతినిధులు శనివారం హైదారాబాద్ కు బయలుదేరారు. కాలుష్య రహిత సమాజానికి ప్రభుత్వాలు తోడ్పాటును అందిస్తున్న తరుణంలో ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ బైక్ విప్లవాత్మకంగా. చక్కని ఆకృతితో రైతులు, వ్యాపారస్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేలా 18 రకాల మోడల్స్ లలో ఒక్కో మోడల్ కు మూడు కలర్ లతో త్రీ వీలర్, ఆటోలు, కార్లు నాణ్యమైన లిథియం అయాన్ బ్యాటరీ, ఫ్లైట్ లకు వినియోగించే ఫైబర్ పరికరాలతో తయారు చేయబడిన ఎడిఎంఎస్ వాహనాల కొనుగోలు రోజురోజుకు పెరుగుతుండటంతో హైదరాబాదులో 3000 మందితో మహా సమావేశాన్ని ఎడిఎంఎస్ ప్రతినిధులు అశోక్, దిలావర్, మహేష్, షాహిన్ ల నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ఎడిఎంఎస్ ప్రతినిధులు హాజరవుతున్నట్లు పన్యాల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజల నుండి కోటీశ్వరుల వరకు అందరూ సంస్థలో భాగస్వామి అవుతున్నారని, ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ప్రస్తుత తరుణంలో ఎడిఏమ్ఎస్ ఎలక్ట్రిక్ బైక్ ల విక్రయాలు చేయడంలో ఎంతో ఆనందంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తొలిగేందుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతున్నట్లు ఏడియం ఎస్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి వి.శ్రీనివాస్, పన్యాల శ్రీనివాస్, కొండ్ర జగన్, నాచుపల్లి రెడ్డి, నర్సింలు, రత్నాకర్, సోఫీ, సత్యనారాయణ, మల్లేశం, రఘు, లింగారెడ్డి, గంగాధర్ తదితరులు తరలి వెళ్లారు.