గవర్నర్, సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన 

గవర్నర్, సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన 

 

జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 21:

గవర్నర్ జిష్ణు దేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించారు. కొల్చారం గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఎడపాయాల,సుప్రసిద్ద మెదక్ చర్చ్ లను,గవర్నర్, సీఎం పర్యటన రూట్ మ్యాప్ ను పరిశీలించారు.పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. గవర్నర్,సీఎం రాక మొదలుకుని హైదరాబాద్ బయలుదేరే వరకూ షెడ్యూల్ ప్రకారం పర్యటన సాగేలా ఏర్పాట్లను గురించి చర్చించారు.ఈ కార్యక్రమం లో మెదక్ డిఎస్పి ప్రసన్న కుమార్,మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి,మెదక్ పట్టణ సిఐ నాగరాజు ఎస్ఐ అమర్ కొల్చారంఎస్ఐ గౌస్,పాపన్నపేట్ ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్,ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment