---Advertisement---

*శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవం* 

---Advertisement---

*శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవం* 

 

తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి డిసెంబర్ 21 :

 

బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో, శనివారం రోజున ఘనంగా మ్యాథ్స్ డే ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు వివిధ రకాల ప్రదర్శనలతో అందరిని అలరించి ప్రశంసలు పొందారు. గణిత శాస్త్రం యొక్క ప్రాముఖ్యత మన నిజ జీవితంలో ఎలా ఉంటుంది అనే అంశంను నాటకం ద్వారా తెలియజేసి, అందరిని అలరించారు. శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్ర నిపుణుల గురించి వివరించి, గణిత శాస్త్రంలో క్విజ్ నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ బోనాల పద్మ, ఉపాధ్యాయిని, ఉపాద్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment