---Advertisement---

మోడల్ స్కూల్ లో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు* 

---Advertisement---

*మోడల్ స్కూల్ లో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు* 

 

తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి డిసెంబర్ 21:

 

బెజ్జంకి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో డిసెంబర్ 22, శ్రీ శ్రీనివాస రామానుజన్ జన్మదినంను పురస్కరించుకొని ముందస్తుగా “ప్రపంచ గణిత దినోత్సవ వేడుకలను” ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపల్ సంగీత మరియు అధ్యాపకుల బృందం భారత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి సత్కరించారు. విద్యార్థులు పలు రకాల ప్రాజెక్ట్ లు, నమూనాలు, వర్కింగ్ మోడల్స్ ను ప్రదర్శించారు. అధ్యాపకులు గణిత శాస్త్ర ప్రాముఖ్యతను, గణిత అభ్యసనంలో భయాన్ని పోగొట్టడానికి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాసాలు, చిత్రాలేఖనం వంటి అంశాలలో పోటీలు, వివిధ రకాల మెమోరి గేమ్స్, మాథ్స్ క్విజ్, పోస్టర్ ప్రెసెంటేషన్ ను నిర్వహించి, గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేసారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంగీత, అధ్యాపకుల బృందం మరియు సిబ్బంది గజ్జెల రమేష్, చంటిబాబు, నగరం శ్రీనివాస్, బిగుళ్ల బాబు, చెప్యాల రమేష్, రామంచ సంజీవ్ విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment