ఉపాధికూలీలతో పాటు అన్నీ రకాల వ్యవసాయ కూలీలకు ఆసరా భృతి అందించాలి
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 22:
కొంతమందికె ఆసరా భృతి ఇవ్వడమంటే ఎగనామం పెట్టడమే
అందరికి ఆసరా భృతికోసం పెద్దఎత్తున ఆందోళన
ఉపాధికూలీలతో పాటు అన్నీ రకాల వ్యవసాయ కూలీలకు అందరికి ఆసరా భృతి అందించాలని,అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఐపాకిమ్స్ )రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపి . రామకృష్ణడిమాండ్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక కార్యాలయంలో ఆదివారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు: ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 12వేల ఆసరా భృతిని 6వేల చొప్పున రెండూవిడతలుగా కూలీలకు ఈ నేల 28నుండి ఇవ్వనున్నట్టు ప్రకటించడం హార్శించదగ్గ విషయం అని కానీ కండిషన్ గా 100రోజులు పని చేసిన ఉపాధి కూలీలకే ఇస్తాం అనడం అమోదించదగిన విషయం కాదు అన్నారు. ఉపాధికూలీలు కాకుండా వ్యవసాయ రంగంలో కూడా అనేక పనులు చేసే కూలీలు ఉన్నారు అని వీరికి కూడా ఆసరా భృతిని అందించాలి అని అయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 51 లక్షలు ఉన్నాయని ప్రభుత్వమే చెప్తుంది అని కానీ 100రోజులు పని చేసిన వారికే ఇవ్వాలని, భూమిలేని కూలీలకే ఇస్తాం అనడమంటే కూలీలకు మొండి చెయ్ చూపడమేనన్నారు. వందరోజలు ఉపాధి పనిచేసినవారు 25వేలు ఉన్నారని ప్రభుత్వం అంటుంది అని మరి వ్యవసాయ కూలీలను ఎందుకు గుర్తించడం లేదు అని ఆయన ప్రశ్నించారు. ఉపాధి, వ్యవసాయ కూలీ అని విభజించి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలి అని చూస్తుంది అన్నారు. వ్యవసాయ కూలీలను విస్మరించడం అంటే ఇచ్చిన హామీని తుంగలో తొక్కడమే నన్నారు. అన్నీ రకాల కూలీలకు ప్రభుత్వం తక్షణమే ఆసరా భృతిని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాపితంగా పెద్దఎత్తున ఆందోళనకు పూనుకుంటాం అని ఆయన హేచ్చరించారు. ప్రెస్ మీట్ లో సిపిఐ( ఎంఎల్ ) మాస్ లైన్ కామారెడ్డి జిల్లా నాయకులు ఏ ప్రకాష్ పి డి ఎస్ యు రాష్ట్ర కోశాధికారి జి సురేష్ తదితరులు పాల్గొన్నారు.