---Advertisement---

ఆర్మూర్ లో “పీవీ. రావు” కాకా వెంకటస్వామిల” వర్దంతి ఘన నివాళులు

---Advertisement---

ఆర్మూర్ లో “పీవీ. రావు” కాకా వెంకటస్వామిల” వర్దంతి ఘన నివాళులు

 

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 22 :

 

మాల మహానాడు వ్యవస్థాపకులు పీవీ రావు,తొలి,మలి దశ తెలంగాణ పోరాట యోధుడు, కార్మిక వర్గ క్రాంతిరేఖ,గుడులేని ప్రజల జీవితాల్లో గుడిసై వెలుగులు నింపిన కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా)ల వర్దంతి సందర్భంగా ఆదివారం రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాల సంఘాల జేఏసీ కో-చైర్మన్ అంగరి ప్రదీప్ మాట్లాడుతూ మాల సామాజిక వర్గ అస్తిత్వం, ఆత్మగౌరవం, ఐక్యత,అభివృద్ధి కొరకు తమ జీవితాలను దారబోసిన పీవీ రావు,కాకా వెంకటస్వామిల జీవితాలను మాల యువత ఆదర్శంగా తీసుకుని మాల జాతి అభివృద్ధికి పాటుపడాలనిపిలుపునిచ్చారు. పీవీరావు దళితుల ఐక్యతకు విఘాతం కలిగిస్తు దళితులను ఉప వర్గీకరించే మనువాదా పాలకుల కుట్రలకు వ్యతిరేకంగా పోరాడి దళితుల హక్కులు, ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని తృణప్రాయంగా వదిలిననిరడంబరా,నిఖార్సయిన త్యాగశీలి పీవీరావు.కాకా వెంకటస్వామి అంటరాని గుడిసె నుండి అఖిల భారత స్థాయి లో పదవులకు వన్నెతెచ్చిన గొప్ప నాయకుడని,తెలంగాణ పోరాటంలో పాల్గొని తెలంగాణ ఆకాంక్షను జాతీయ స్థాయిలో వినిపించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పెద్దలను ఒప్పించి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన గొప్ప నాయకుడు కాకా వెంకటస్వామి అని అన్నారు,కాకా కార్మిక మంత్రిగా అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అసంఘటిత రంగంలోని కార్మిక లోకానికి పెన్షన్ ఇప్పించిన గనుడన్నారు తన జీవితంలో అనేక గొప్ప నిర్ణయాలు తీసుకొని పేద ప్రజాల పాలిట గొప్ప వ్యక్తిగా నిలిచారన్నారు ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మాల సంఘాల జేఏసీ సభ్యులు పింజ పెద్ద బోజన్న, షెట్పల్లి నారాయణ, పులి సాయిరాం,నగసేన్ మాల,అగ్గు క్రాంతి, పింజ భూమేశ్వర్,టీం నాయకులు ఆంద్రయ్య,అబ్బా రవి,వినయ్ కుమార్,మామిడి రవీందర్,రత్నం,అంబులెన్స్ రాజు,వికాస్,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment