---Advertisement---

మున్సిపల్ అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలి*

---Advertisement---

*మున్సిపల్ అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలి*

*- మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి*

*- ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ నాయకుల ఓపెన్ సవాల్*

 

తెలంగాణ కెరటం డిసెంబర్ 22 బొల్లారం మున్సిపాలిటీ పటాన్ చెరువు ప్రతినిధి

 

బొల్లారం అభివృద్ధిపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ చర్చకు సిద్ధమేనా అంటూ బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి ఓపెన్ సవాల్ విసిరారు. బొల్లారంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులతో కలిసి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి చేస్తున్న వ్యాఖ్యలను బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మున్సిపాలిటీలో హరితహారం మొక్కలు ఎక్కడ నాటారని ప్రశ్నించారు. ఎంతమందికి పెన్షన్లు రేషన్ కార్డులు అందించారని చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే జరుగుతున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి సంవత్సరం గడిచిన స్థానిక బిఆర్ఎస్ నాయకులు అదే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలుసుకోవాలన్నారు. అధికారం కోసమే రాజకీయాలు చేసే నాయకులని మండిపడ్డారు. అందుకోసం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో మారడం స్థానిక నాయకులకు అలవాటేనన్నారు. ఇక మీ పప్పులు ఉడకవని హెచ్చరించారు. మూడో వార్డులో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలని కౌన్సిలర్ను డిమాండ్ చేశారు. వార్డులోని సమస్యలు కళ్ళకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అస్తవ్యస్తంగా ప్రణాళిక లేకుండా రోడ్లను తవ్వి ఇష్టారాజ్యంగా వేస్తున్నారని ఎద్దేవా చేశారు. మున్సిపల్ అభివృద్ధిపై పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట గాంధీ చౌరస్తాలో చర్చకు రావాలని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. అనంతరం కౌన్సిలర్లు మున్సిపల్ నాయకులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం ఏర్పడిన బీసీ కాలనీలో ఇప్పటివరకు అభివృద్ధికి నోచుకోలేదని స్పష్టం చేశారు. పది సంవత్సరాలుగా అభివృద్ధిలో ఉన్న పాలకులు వార్డు అభివృద్ధిపై దృష్టి పెట్టక పక్షపాత ధోరణి అవలంబించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఇప్పటివరకు మిషన్ భగీరథ పైప్లైన్ కనెక్షన్లు ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. సమస్యల నిలయాలుగా ప్రతి కాలనీ లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు. వీటికి బాధ్యులు ఎవరని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎస్సీ కాలనీ బీసీ కాలనీ గాంధీ నగర్ పోచమబస్తీ జ్యోతి నగర్ కాలనీలలో మౌలిక వసతుల ఏర్పాటులో మున్సిపల్ పాలకవర్గం చిన్న చూపు చూసిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. పాలకవర్గం అవలంబిస్తున్న తీరుపై ప్రజలు సరైన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాలమ్మ చంద్రయ్య నర్సింహారాజు నాయకులు లక్ష్మా రెడ్డి సంపత్ రెడ్డి శ్రీధర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ రాజు రాజ్ గోపాల్ చంద్రారెడ్డి మాజీ వార్డ్ మెంబర్ భాస్కర్ చక్రపాణి రవీందర్ రెడ్డి శేఖర్ యువజన నాయకులు అబ్దుల్ బషీర్ ఇమ్రాన్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment