---Advertisement---

ఎం ఎస్ రెడ్డి పాఠశాలలో ఘనంగా ఎడ్యుకేషన్ ఫెయిర్ .

---Advertisement---

ఎం ఎస్ రెడ్డి పాఠశాలలో ఘనంగా ఎడ్యుకేషన్ ఫెయిర్ .

 

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 22 .

వ్రముఖ శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్గారి జన్మదినం పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవంను సందర్భంగా శనివారం ఎం ఎస్ రెడ్డి పాఠశాలలో విద్యార్థులు ఘనంగా ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు గణిత నమూనాలులో పజిల్స్ మరియు తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలకు సులభరీతిలో సమాధానాలు చెప్పడం, రంగు రంగుల ఆకర్షణీయమైన ప్రదర్శనలు తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఎంతో చక్కగా వారి ప్రదర్శనలను వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చామకూరి శ్రీనివాస్ గౌడ్ , ప్రిన్సిపల్ రజిని దేవి , టీచర్స్ , స్వర్ణలత, శివాని,అనూష , ఉష, మౌనిక, రమాదేవి, మల్లిక, సంగీత మరియు తల్లిదండ్రులు పాల్గొని ప్రదర్శనలను తయారు చేసిన విద్యార్థులను అభినందించారు. పిల్లల బంగారు భవిష్యత్తు కి పాఠశాలలో ఇలాంటి ప్రదర్శనలు చేయించడం ఆనందకరమైనదిగా తల్లిదండ్రులు తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment