పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసిన గవర్నర్ పర్యటన.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 22:
మెదక్ జిల్లా లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారి పర్యటన పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసింది. గవర్నర్ మొదటగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం లోకి రాగా జిల్లా ఎస్పి సాదర స్వాగతం పలికి పూల మొక్క ను అందించినారు అనంతరం గవర్నర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించినారు. గవర్నర్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పి గారి తో ముచ్చటించినారు. మెదక్ చర్చి 100 సం:రాలు పూర్తి అయిన సందర్భంగా సుప్రసిద్ద మెదక్ చర్చ్ ని సందర్శించి ప్రత్యేక ప్రార్థన లో పాల్గొన్నారు. ప్రార్థనలు ముగించుకొని కొల్చారం మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ జరిగిన నృత్య ప్రదర్శనను ఆసక్తిగా తిలకించి వారికి ప్రేరణాత్మక ప్రసంగన్ని ఇచ్చారు.తరవాత గవర్నర్ పిల్లలతో కలసి బోజనం చేసి పర్యటనను ముగిoచుకొని తిరుగు బయలుదేరు వరకు ఎలాంటి అవాంచినీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బందోబస్త్ ఎర్పాట్లు చేశారు.గవర్నర్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసినందుకు సిబ్బందికి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అబినందనలు తెలియజేశారు.