*విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి..*
*పెండింగ్ ఫీజు బకాయాలను విడుదల చేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తాం..*
*టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడుతున్న టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్..*
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 22..
కామారెడ్డి జిల్లా కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలకు 2024-26 సంవత్సరాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అవినీతి రహిత రాజకీయ వ్యవస్థలు ఏర్పడడం జరుగుతుందని,తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని అన్నారు.విజన్ 2020 పేరుతో అన్ని రంగాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆనాడే అందజేసి విద్యారంగంలో పారిశ్రామిక రంగంలో సాఫ్ట్ వేర్ ఎగుమతులలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల బలోపేతానికై 10 డిఎస్సీ లను నిర్వహించి 1,50,000 ల మంది ఉపాధ్యాయులను నియమించిన ఘనత టిడిపికే దక్కిందన్నారు.టిడిపి సభ్యత నమోదును గ్రామ గ్రామానికి తీసుకువెళ్లాలని 100 రూపాయల సభ్యత్వాన్ని రెండు సంవత్సరాల కోసం నిర్ణయించడం జరిగిందని,సభ్యత్వం తీసుకున్న వారందరికీ ఐదు లక్షల ప్రమాద బీమా సదుపాయాన్ని కూడా పార్టీ అందజేస్తుందని అన్నారు.
ఈ సమావేశంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల సాధన కోసం టిఎన్ఎస్ఎఫ్ నిరంతర పోరాటం చేస్తుందని తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయలను వెంటనే చెల్లించాలని అన్నారు,టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విద్యా వ్యతిరేక విధానాల వల్ల ఈ రోజు కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అధ్యాపకులు యాజమాన్యాలు తీవ్రమైన ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందని,మూడు సంవత్సరాల ఫీజు బకాయలను చెల్లించకపోవడంతో అధ్యాపకులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదన్నారు,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫీజు బకాయిలను విడుదల చేస్తానని చెప్పడం జరిగిందని ఇప్పటివరకు ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయలేదని అన్నారు,ఫీజు బకాయాలను చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు డీజే శివగౌడ్,మోతే రాజిరెడ్డి,సవీందర్ చౌహన్,చౌట గణేష్,మురళి,జహీరాబాద్ పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ ఇంచార్జ్ అంజల్ రెడ్డి,సతీష్,రాజు,సందీప్ లు పాల్గొనడం జరిగింది.