మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు విలేకరులతో ప్రెస్ మీట్. 

మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు విలేకరులతో ప్రెస్ మీట్. 

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 23:

 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులకు ఇచ్చే గిఫ్టులను కూడా ఇవ్వకుండా అన్యాయం చేసింది.

క్రిస్టమస్ పండుగను అధికారికంగా జరిపిన తొలి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ గారు, తొలిరాష్ట్రం తెలంగాణ.క్రైస్తవులు పండుగను సంతోషంగా చేసుకునేలా పండుగ తెల్లవారి బాక్సింగ్ డేను కూడా సెలవు దినంగా ప్రకటించి,

రెండు సెలవు దినాలిచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఆనేకే బాద్ బతుకమ్మ కా తోఫా బంద్ హోగయా,రంజాన్ కా తోఫాబంద్ హోగయా,క్రిస్మస్ కాబీ తోఫా బంద్ హోగయా ఇలా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులకు అన్ని మతాల వారికి అన్యాయం చేశారు.రాష్ట్రంలో ఇవాళ ఎవరికీ శాంతి లేదు,భద్రత లేదు.రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఒర్లుడు తప్ప, ఓదార్పు లేదు. ఏమన్నంటే.. పేగులు మెడలేసుకుంటా,చీరుతా, సంపుతా,గోటీలాడుకుంటా, లాగుల తొండలు సొర్రగొడుత.. గివ్వే తప్ప ఒక వర్గాన్ని ఎవరినైనా ఓదార్చిండా? సర్వశిక్ష అభియాన్ వాళ్లు రోడ్డు మీద ధర్నా చేస్తున్నరు.మీకు మాటిచ్చిన, యాడాదికో,ఆర్నెళ్లకో,మూడు నెల్లకో చేస్తా అని చెప్పి వారిని ఓదార్చడం లేదు.అడిగిన వాళ్లను అదరగొట్టుడు, ప్రశ్నించిన వాళ్లమీద పగబట్టుడు. ఇదీ ఈ రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నది.

అసెంబ్లీలో అడిగిన దానికి సమాధానం లేదు.రేవంత్ అడ్డగోలుగా అదరగొట్టే మాటలు మాట్లాడుతడు.మాకు మైక్ ఇవ్వండి అని అడిగితే,మైక్ ఇవ్వద్దని స్పీకర్ కు చెబుతడు

అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి హద్దులు దాటి ప్రవర్తించిండు, అబద్ధాలు మాట్లాడిండు

ఏదిపడితే అది అడ్డగోలుగా నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పి సభను అపవిత్రంగా మార్చిండు

మీ ప్రభుత్వం పాలసీలు ఏవి అని అడిగితే,పోలీసు వాళ్లను ఇంటికి పంపుతారు.చివరికి ఎందాక వచ్చిందటే పోలీసులు తమ పని తాము చేయలేక రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది,రికవరీ రేటు తగ్గింది.ఎంతసేపూ ప్రతిపక్షాల మీద, వారిని అణచివేయడం మీద,అక్రమ కేసులు పెట్టడం మీద, మా మీద నిఘా పెట్టడం మీద నీ పాలన నడుస్తున్నది.

ఏం జరిగింది నీ పాలనలో అంటే.. నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఏడాది శాంతిభద్రతల మీద రిపోర్టు ఇచ్చిండు.

కేసీఆర్ పాలనకంటే,రేవంత్ పాలనలో ఏడాదిలో 41శాతం క్రైమ్ రేటు పెరిగింది.

నువ్వు మంచిగ పనిచేసినవా, లేదా అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలదా?

గతంలో బీఆర్ఎస్ పాలనలో ఏడాది 25 వేల కేసులైతే – రేవంత్ పాలనలో ఏడాదిలో 35 వేల కేసులైనయి.అంటే 10 వేల కేసులు ఒక్క హైదరాబాద్ నగరంలోనే పెరిగినయి.మర్డర్లు, రేపులు, చైన్ స్నాచింగులు, రాబరీలు, దొంగతనాలు, ల్యాండ్ కేసులు హోం మినిస్టరువు నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే, నీ పాలనలో 10 వేల కేసులు పెరిగినయంటే ఏమనుకోవాలె,

ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్, హోం మినిస్టరుగా నువ్వు ఫెయిల్, లా అండ్ ఆర్డర్ నిర్వహణలో నువ్వు ఫెయిల్.రాష్ట్రంలో నీ ఏడాది పాలనలో 9 మతకలహాల సంఘటనలు జరిగినయి.

రాష్ట్రంలో శాంతీ లేదు, పౌరులకు భద్రత లేదు,అందరినీ ఇబ్బంది పెడుతా ఉన్నడు రేవంత్

అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి,ఆరు గ్యారెంటీల గురించి చేతులెత్తేసిండు.నమ్మి ఓటేసిన రాష్ట్ర ప్రజలకు గాడిద గుడ్డు మిగిల్చిండు రేవంత్ రెడ్డి

ఏడాది కాలంలో 1 లక్షా 27 వేల కోట్ల అప్పులు చేసిండు రేవంత్ రెడ్డి, బడా కాంట్రాక్టర్ల దగ్గర పర్పంటేజీలు తీసుకొని బిల్లులిచ్చిండు బీఆర్ఎస్ పదేండ్లలో 4 లక్షల 17 వేల కోట్లు చేస్తే, నువ్వు ఒక్క ఏడాదిలోనే 1 లక్షా 27 వేల కోట్ల అప్పు చేసినవు.ఒక్క గ్యారెంటీని అమలు చేయలేదు.రైతుబంద్ బందు చేసినవు,కేసీఆర్ కిట్ బంద్ చేసినవు,న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినవు,బతుకమ్మ చీరెలు బంద్ చేసినవు.చెరువులల్లో చేప పిల్లలేసుడు బంద్ చేసినవు. దళితబంధు, బీసీ బంద్ బందు పెట్టినవు.పిల్లలకు ఫీజు రీయింబర్సుమెంట్ బందు పెట్టినవు.కొత్త పథకాలిచ్చిందేమీ లేదు కానీ,ఉన్న పథకాలు బంద్ చేసిండు రేవంత్ రెడ్డి.వాస్తవాలు చెబితే, మేం ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అసెంబ్లీని బుల్డోజ్ చేస్తున్నడు

అసెంబ్లీలో రెండు మూడు గంటలు సుత్తి మాట్లాడిండు రేవంత్ రెడ్డి రైతు భరోసాఎంత ఇస్తవో,ఎన్ని ఎకరాలకు ఇస్తవో, ఎప్పుడిస్తవో ఏమీ చెప్పలేదు

మొన్న వానాకాలం రైతుబంధుకు ఎగనామం పెట్టిండు, యాసంగిలో కూడా ఎగనామం పెట్టినట్లే కనబడ్డది చర్చలో, రైతుబంధు ఎప్పుడిస్తవో ఇప్పటికైనా చెప్పాలె.

చెప్పిన మాట ప్రకారంగా రైతులందరికీ ఎకరాకు వానాకాలం రూ.7500 + యాసంగి 7500 కలిపి 15 వేల చొప్పున ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన మేం డిమాండ్ చేస్తున్నం.

కేసీఆర్ ముందే చెప్పిండు రైతుబంధు బంద్ అవుతదని, అప్పుడేమో అట్లా బందు పెట్ట, రైతుబంధు ఇస్త, నేనేమన్నా దివానా గాన్నా అన్నడు

ఇవాళ ఎవరు దివానా గాడో మీరే చెప్పాలె.ఇంకా మూడుసార్లు రైతుబంధు ఇవ్వాలన్నడు, కౌలు రైతుకు కూడా ఇస్తమన్నడు, అందరికీ ఎగబెట్టిండు

మీ పాలనలో మీది ఒక మాట, మీ మంత్రిది ఇంకో మాట,వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12 వేలు ఇస్తమన్నడు, ఎగ్గొట్టిండు.

ఇవాళ కొర్రీలు పెట్టి, కోత పెడుతున్నడు.ఐదారుగుంటల భూమి ఉన్నోళ్లను కూడా వ్యవసాయ కూలీ కాదంటున్నడు

ఎకరం భూమి ఉన్నోళ్లను కూడా వ్యవసాయ కూలీలుగానే గుర్తించాలని బీఆర్ఎస్ కోరుతున్నది.ఉపాధి హామీ పనులకు వెళుతున్న వారందరినీ వ్యవసాయ కూలీలుగా గుర్తించాలని బీఆర్ఎస్ కోరుతున్నది.తిండిపెట్టే రైతులకు తొండి చేసి, పైసలు ఎగ్గొట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నడు

రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ రైతుబంధును ప్రారంభిస్తే, రైతుబంధును బొందపెట్టిండు

11 విడుతల్లో 72 వేల కోట్ల రూపాయలు రైతుంబంధు ఇచ్చి, రైతులపై ప్రేమను చాటుకున్నడు కేసీఆర్ దుక్కిదున్నే రైతు దు:ఖం తీర్చింది కేసీఆర్ అయితే,రైతేను దు:ఖంలో పెడుతున్నడు రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను,ఎమ్మెల్యేలను నిలదీయాలని బీఆర్ఎస్ పిలుపినిస్తున్నది.రుణమాఫీపై కూడా అంతా అయిపోందంటున్నడు రేవంత్ రెడ్డి,నేను ఛాలెంజ్ చేసిన,గన్ మెన్లను వదిలేసి ఏ ఊరికైనా పోదాం పద ,25వ తారీక్ ఏ ఊరికైనా పోవడానికి నేను సిద్ధం

ముఖ్యమంత్రి మాట అంటే కొంచెం ఇజ్జత్ ఉండాలె కదా,అవేం లేవు ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టుపెట్టి మాట తప్పినవు, అమ్మవారు పవర్ ఫుల్ ఇప్పటికైనా తప్పైందని వెళ్లి అమ్మవారి ముందు తప్పులు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకో

వందేళ్ల చరిత్ర కలిగిన మెదక్ చర్చిమీద ఒట్టుపెట్టి మాట తప్పినవు. తప్పు చేసిన వారిని కూడా ఏసుప్రభువు క్షమిస్తాడు, ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం చేసుకో.

జహంగీర్ పీర్ దర్గామీద కూడా ఒట్టుపెడితివి, మాట తిప్పితివి.

ముక్కోటి దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మాట తప్పినవు రేవంత్ రెడ్డి.

రుణమాఫీపై బ్యాంకర్ల మీటింగులో 49 వేల కోట్లు అన్నడు, బడ్జెట్లో 26 వేల కోట్లు అన్నడు. చివరకు 17 వేల కోట్లు అని,12 వేల కోట్లే ఇచ్చిండు.

మహబూబ్ నగర్ లో 2,750 కోట్లు రుణమాఫీ ఏసేసిన అన్నడు, ఏదీ ఇంకా వేయలే

2 లక్షల మీద అప్పు ఉన్నోళ్లు జల్దీ కట్టున్రి అన్నడు. రైతులు అవి కడితిరి,ఈ మిత్తి, ఆ మిత్తి ఏమై పోవాలె పొద్దున పేపర్ చూస్తే, అప్పుల బాధతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నరు, ఆ వార్త కలిచివేసింది.మెదక్ జిల్లాలో కూడా ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నడు. రేవంత్ పాలనలో దాదాపు నాలుగైదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరుకాంగ్రెస్ వచ్చినంక రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. రైతుబంధు,రుణమాఫీ,అన్ని పంటలకు బోనస్ అన్నీ ఎగ్గొట్టిన్రు45 లక్షల టన్నుల సన్న వడ్లు కొంటమని మంత్రి ఉత్తమ్ చెప్పిండు,కానీ, కొన్నది మాత్రం 18 లక్షల టన్నులే, వాళ్లలో ఇంకా కొందరు రైతులకు డబ్బులే రాలేదు.ధాన్యం దళారుల పాలైంది, రైతులు మూడు, నాలుగు వందల తక్కువకే ప్రేవేటుకు అమ్ముకున్నరునేను ఉత్తమ్ కుమార్ ను అడుగుతున్న మీరు కొంటా అన్న సగం వడ్లు ఏడపోయినయి?ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. వడ్లు కొనడం కూడా చేతగానిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ, బోనస్, రైతుబంధు రావాలంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయండి.

Join WhatsApp

Join Now

Leave a Comment